DRESS VIRAL: సాధారణంగా మనం డ్రెస్ వేసుకోవడానికి ఎంత లేదన్న ఐదు నిమిషాల సమయం అయినా పడుతుంది. అదే ఇక ఆడవారు చీర కట్టుకోవాలంటే 15-30 నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే తాజాగా ఓ యువతి నమోదు చేసిన ఓ రికార్డును చూసి.. షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ.. వాళ్లు నమోదు చేసిన నయా.. షాకింగ్ రికార్డు ఏంటో తెలుసా.?
మలేషియాకు చెందిన ఓ మహిళ నిమిషం వ్యవధిలో 65 డ్రెస్సులు మార్చి.. ఔరా అనిపించింది. అది కూడా స్టేజీ మీద. అదేలా సాధ్యం అంటే.. మ్యాజిక్. చిన్, సిల్వియా లిమ్ అనే జంట ఈ ఫీట్‌ను చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా మహిళ స్టేజీ మీద నిల్చుని ఉంటుంది. ఆమె భర్త మ్యాజిక్ చేసే వాళ్లు ఉపయోగించే పెద్ద వస్త్రాన్ని ఆమె మీద కప్పుతాడు.
ఆ వలను ఒక్కసారి పైకి లేపి కిందకు తీసే.. గ్యాప్‌లోనే ఆమె డ్రైస్‌ను మార్చుకుంది. ఇలా నిమిషం వ్యవధిలో ఈ జంట 65 డ్రెస్సులు మార్చినట్లు ఇల్యూషన్ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.
Video:
Also read:
Viral Pic: ఈ ఫోటోలో ఉన్న చిరుతను గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
Viral Video: తండ్రితో పెళ్లికూతురు క్రేజీ డ్యాన్స్.. మనసులను దోచుకుంటున్న వీడియో.. నెట్టింట వైరల్..