భారతదేశంలో అడుగడునా ఓ గుడి ఉంటుంది అంటారు. అలాగే, మన దేశంలో ఎన్నో శివాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కో ఆలయానికి విశిష్టత ఉంటుంది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని బార్సూర్‌లో అద్భుతమైన శివాలయం ఒకటి ఉంది. చారిత్రక నగరం బార్సూర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని పిలుస్తారు. ఈ ఆలయం 32 స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. రెండు గర్భాలయాలు కలిగిన ఏకైక ఆలయం ఇదే. అంతేకాదు.. ఇక్కడ శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. భక్తులు శివలింగంను తిప్పుతూ కోరుకున్న కోర్కెలను ఆ శివయ్య నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. రాజమహర్షి గంగామహాదేవి 1208లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి.
అలాగే, ఇటువంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగే 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం ‘బాబా మహాకాల్’ సమీపంలోని రామేశ్వరాలయంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. శ్రావణ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ప్రయోజనం ఉంటుందని చెబుతారు.
ఈ వీడియో చూడండి..
ताजमहल को अजूबा मानने वालों जरा हमारी सनातन संस्कृति पर नजर डालो भगवान शिव को समर्पित 1100 साल पुराना बत्तीसा मंदिर बारसूर ,अनोखी बात यह है कि यहां दोनों गर्भगृहों में स्थापित शिवलिंग 360° में घूमता है..
हर हर महादेव,🙏https://t.co/P6fAKS60MA pic.twitter.com/4OXzq3FsQc— रजनी कांत सिंह (@rajnikantsinghr) September 16, 2024
ఈ శివలింగాన్ని సీతా సమేత రాముడు, లక్ష్మణుడు ప్రతిష్టించారని నమ్ముతారు. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే..12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. 360 డిగ్రీలు తిరిగే ఈ శివలింగంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..