Viral News: 8 ఏళ్ల బాలుడికి ఎంతకూ తగ్గని కంటి నొప్పి.. పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లగా..

చిన్నారులకు మాత్రమే పెద్దలు కూడా శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా.. ఎటువంటి వ్యాధుల బారిన పడినా భరించలేరు. అందునా సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అన్ని ఇంద్రియాల్లో కళ్ళు ముఖ్యమైనవి. అటువంటి సునితమైన కళ్ళలో చిన్న నలక పడినా ఇబ్బంది పడతాం. కంటి నుంచి బయటకు వచ్చేవరకూ శ్రమిస్తాం. అటువంటిది ఒక బాలుడు కనురెప్పలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 పురుగులు ఉన్నాయి. అది చూసి వైద్యులే షాక్ తిన్నారు.

Viral News: 8 ఏళ్ల బాలుడికి ఎంతకూ తగ్గని కంటి నొప్పి.. పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లగా..
Viral News

Updated on: Jun 16, 2025 | 2:02 PM

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని సావర్కుండ్లలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక లల్లూభాయ్ సేథ్ ఆరోగ్య మందిర్ ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం వచ్చాడు. ఆస్పత్రిలోని ఐ స్పెషలిస్ట్ బాలుడి కళ్ళను పరీక్షించేందుకు రెడీ అయింది. బాలుడి కళ్ళను డాక్టర్ మృగాంక్ పటేల్ పరీక్షించారు. అప్పుడు బాలుడి కంటిలో కనిపించిన జీవులను చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే బాలుడి కనురెప్పల్లో తల పేను వంటి పరాన్నజీవులు కాపురం పెట్టేశాయి. ఈ కను రెప్పల్లో కీటకాలు ఏకంగా గుడ్లు పెట్టాయని పరీక్షలో తెలియడంతో డాక్టర్ షాక్ తిన్నారు.

బాలుడి కంటి ఆపరేషన్ సక్సెస్

బాలుడి కనురెప్పల నుంచి ఈ పరాన్నజీవులను తీసివేయడానికి వైద్యులు ఎటువంటి ఆపరేషన్ నిర్వహించకుండా కేవలం ఒక ఐ డ్రాప్స్ ని వేసి చికిత్సని అందించారు. కేవలం కళ్ళలో డ్రాప్స్ వేసి పిల్లాడి కళ్ళ నుంచి 30 పురుగులు, 35 గుడ్లను తొలగించారు. ఇలా కనురెప్పల నుంచి పురుగుల ను తొలగించడానికి డాక్టర్ కి దాదాపు ఒకటిన్నర గంటల సమయం పట్టింది. ఈ రకమైన ఆపరేషన్ అమ్రేలిలో మొదటిసారి చేయడం అని వైద్యులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ ఏమని స్పందించారంటే

ఆపరేషన్ చేసి కనురెప్పల్లో ఉన్న పురుగులను, గుడ్లను తొలగించిన తర్వత బాలుడి పరిస్థితి మెరుగుపడింది. తర్వాత బాలుడు చలాకీగా ఆడుకుంటూ నవ్వుతూ కనిపించినట్లు వైద్యాలు చెప్పారు. ఈ పరాన్నజీవులు కళ్ళకు చాలా హానికరమని .. ఇవి రక్తాన్ని పీల్చేస్తాయని చెప్పారు. కనుక వీటిని సకాలంలో గుర్తించి అందుకు తగిన విధంగా చికిత్స అందించక పొతే చివరకు కంటి చూపుని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.

ఈ లల్లూభాయ్ సేథ్ ఆరోగ్య మందిరంలో ప్రతిరోజూ 1500 మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తుంది. దాతల సహకారంతో నెలకు 85 లక్షల ఖర్చుతో వైద్య సేవలను అందిస్తుంది. అయితే ఇటువంటి అరుదైన కేసులు ఆసుపత్రి సామర్థ్యాన్ని, నిపుణుల నిబద్ధతను పదిమందికి తెలియజేస్తాయి. బాలుడి కంటి నుంచి పరాన్న వులను తొలగించే ఈ సంక్లిష్టమైన ఆపరేషన్ ఒక అద్భుతమైన విజయం.. స్థానిక ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..