జంతువులంటే మనకు ఎప్పుడూ ఉత్సుకత. సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి. పెంపుడు జంతువుల నుండి అడవి జంతువుల వరకు అరుదైన వీడియోలు చూడటం పట్ల ప్రజలు చాలా ఆసక్తిని చూపుతుంటారు. అలాంటిదే చింపాంజీ వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 28 ఏళ్ల తర్వాత బోనులోంచి బయటకు వచ్చిన చింపాజీ తొలిసారి ఆకాశాన్ని చూసిన దాని స్పందన నెట్టింట వైరల్ అవుతోంది. వెనిలా అనే మారుపేరుతో ఉన్న ఆడ చింపాంజీ న్యూయార్క్‌లోని ప్రైమేట్స్ (LEMSIP)లో ప్రయోగాత్మక వైద్యం, శస్త్రచికిత్స కోసం ల్యాబొరేటరీలో 28 సంవత్సరాలు గడిపింది. బయటి ప్రపంచం చూడకుండా ప్రయోగశాలలోని ఐదడుగుల ఇరుకైన బోనులో ఇన్ని రోజులు గడిపింది. ల్యాబ్‌లలో కేజ్‌కు ఖాళీ స్థలం తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి వనిల్లాను ఫ్లోరిడాలోని సేవ్ ది చింప్స్ శాంక్చురీకి తీసుకెళ్లినప్పుడు తీసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫ్లోరిడా చేరుకున్న తర్వాత వనిల్లా మొదటిసారిగా ఆకాశాన్ని చూసింది. విశాలమైన ఆకాశాన్ని వెనీలా ఆస్వాదిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో అలరించాయి.
ఆ తర్వాత తన ఎదురుగా వచ్చిన మగ చింపాంజీ డ్వీత్‌ను వనిల్లా ఆనందంగా కౌగిలించుకుంది. అప్పుడు అది ఆకాశం వైపు చూస్తూ ఉత్సాహంతో నిండిన తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. వనిల్లా ఫ్లోరిడాలోని సేవ్ ది చింప్స్ అభయారణ్యంలో షేక్, మ్యాజిక్, జెఫ్ మరియు ఎర్నెస్టా వంటి మరో ఆరు చింపాంజీలతో కలిసి నివసిస్తుంది. క్వారంటైన్ ప్రక్రియ పూర్తయింది. అభయారణ్యంలోని చింపాంజీలు ఉండే ప్రాంతంలో ప్రస్తుతం వనిల్లా సురక్షితంగా ఉంది. సేవ్ ది చింప్స్‌లో ప్రైమటాలజిస్ట్ అయిన డాక్టర్ ఆండ్రూ హల్లోరన్, వనిల్లా తన కొత్త కేజ్‌కి పరిచయం చేసిన వీడియో ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Heart-warming moment Vanilla the chimp, 29, explodes with joy when she sees the sky for the first time after being caged her entire life. pic.twitter.com/LYbf7S1lWB
— Carlos Perez (@CarlosP95095856) June 27, 2023
వెనీలా కొత్త వాతావరణానికి అనుగుణంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. సేవ్ ది చింప్స్ అభయారణ్యం ప్రస్తుతం 200 పైగా చింపాంజీలను కలిగి ఉంది. 1995లో వనిల్లాను ల్యాబ్ నుండి కాలిఫోర్నియాలోని వైల్డ్‌లైఫ్ వేస్టేషన్‌కు తరలించారు. దానితో పాటు దాదాపు 30 చింపాంజీలు కూడా అభయారణ్యం చేరుకున్నాయి. అయితే అక్కడ కూడా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వనిల్లాను బోనులో బంధించారు. 2019లో, అన్ని వన్యప్రాణులను కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ (CDFW) గుర్తించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..