Viral: ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయిన వ్యక్తి.. ఆస్పత్రికెళ్లగా.. ఎక్స్‌రేలో షాకింగ్ నిజం!

|

May 23, 2023 | 7:26 PM

ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయాడు ఓ వ్యక్తి. అతడికేం జరిగిందో కుటుంబసభ్యులకు ఒక్క క్షణం అర్ధం కాలేదు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా..

Viral: ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయిన వ్యక్తి.. ఆస్పత్రికెళ్లగా.. ఎక్స్‌రేలో షాకింగ్ నిజం!
Viral
Follow us on

ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయాడు ఓ వ్యక్తి. అతడికేం జరిగిందో కుటుంబసభ్యులకు ఒక్క క్షణం అర్ధం కాలేదు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్లు అతడిపై పలు టెస్టులు నిర్వహించారు. ఇక ఎక్స్‌రే చూడగా.. షాకింగ్ నిజం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడమే కాకుండా.. మూర్చతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతడ్ని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించి.. ఎక్స్‌రే తీయగా.. అందులో షాకింగ్ నిజం బయటపడింది. సదరు వ్యక్తి అనుకోకుండా 1.5 అంగుళాల సిల్వర్ లైనెడ్ కట్టుడు పళ్లు మింగడం వల్ల.. అవి ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని.. అలాగే మూర్చ వచ్చి పడిపోయాడని డాక్టర్లు చెప్పారు.

క్యూరియస్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఈ కేస్ స్టడీ ప్రకారం.. ఆ కట్టుడు పళ్లు అన్నవాహిక గుండా జీర్ణవ్యవస్థలోకి వెళ్లడానికి బదులుగా, ఊపిరితిత్తులకు ప్రాణవాయువునుఅందించే ప్రధాన మార్గానికి అడ్డుపడింది. పలు టెస్టులు నిర్వహించిన తర్వాత డాక్టర్లు అతడి ఊపిరితిత్తుల నుంచి ఆ వస్తువును తొలగించడానికి బ్రోంకోస్కోపీ కోసం తరలించారు. సుమారు రెండు నుంచి మూడు గంటల శస్త్రచికిత్స అనంతరం కట్టుడు పళ్లను సదరు వ్యక్తి ఊపిరితిత్తుల నుంచి తొలగించారు. ఆ తర్వాత అతడికి స్టెరాయిడ్ చికిత్స అందించారు డాక్టర్లు. కాగా, చివరికి ఆ వ్యక్తి ఆరోగ్యవంతంగా ఆసుపత్రి న్యుంచి డిశ్చార్జ్ అయ్యారని మెడికల్ జర్నల్‌లో డాక్టర్లు పేర్కొన్నారు.