AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఏంటి ఒక్క టికెట్ రూ.10లక్షలా.. ఈ మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులకు ఇదో భారీ షాక్ ఇచ్చే వార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే పీపా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ ఒక్క టికెట్ ధరతో ఓ సామన్యుడు ఏడాది పాటు జీవించొచ్చు. అవును ఫైనల్ మ్యాచ్ ఒక్క టికెట్ ధర అంతుంది మరి. ఒక్కట టికెట్‌ ఏకంగా రూ.10.23 లక్షలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. దీంతో ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Viral News: ఏంటి ఒక్క టికెట్ రూ.10లక్షలా.. ఈ మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Football Tickets
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 03, 2026 | 12:07 PM

Share

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్‌ కఫ్ ఫైనల్‌ మ్యాచ్ చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులను పాకేట్‌కు ఇక భారీ చిల్లు పడనుంది. ఎందుకంటే వరల్డ్ ఫైనల్ మ్యాచ్ ఒక్కో టికెట్ ధర రూ.10.23లక్షలు ఉండనున్నట్టు తెలుస్తోంది. అమెరికా కరెన్సీలో చూస్తే ఇది 10,990 డాలర్లు. కేవలం 90 నిమిషాల మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఇంత భారీ మొత్తం ఖర్చు చేయాల్సి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే మొత్తంతో భారతదేశంలో మంచి స్థాయి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. త్వరలో 2026 FIFA World Cup అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన టికెట్ ధరలను ఫిఫా ఇప్పటికే దశలవారీగా పెంచింది. మొదటి దశలో కొన్ని టికెట్లు 8,680 డాలర్లకు విక్రయించగా, ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి.

కేటగిరీ-2 టికెట్లు మొదట 5,575 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 7,380 డాలర్లకు చేరాయి. అలాగే కేటగిరీ-3 టికెట్లు 4,185 డాలర్ల నుంచి 5,785 డాలర్లకు పెరిగాయి. టోర్నీ సమయం దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల కనిపిస్తోంది. టికెట్ల కోసం అభిమానులు ఫిఫా అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం గమనించాల్సి ఉంటుందని నిర్వాహకులు సూచిస్తున్నారు. సేల్ ప్రారంభమైన వెంటనే కొన్ని నిమిషాల్లోనే టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యే పరిస్థితి ఉంది.

గ్రూప్ స్టేజ్‌లో మొత్తం 72 మ్యాచ్‌లు ఉండగా, ప్రస్తుతం కొద్దిమంది మ్యాచ్‌లకు మాత్రమే టికెట్లు విడుదల చేశారు. కొన్ని మ్యాచ్‌ల టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయాయి. ముఖ్యంగా అమెరికాలో జరిగే మ్యాచ్‌లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే, ఈసారి వరల్డ్ కప్ కేవలం క్రీడా పండుగ మాత్రమే కాకుండా, భారీ వ్యాపార వేదికగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభిమానులకు మాత్రం ఇది ఖర్చుతో కూడిన అనుభవంగా మారుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us