
సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో రద్దీగా ఉన్న ఒక రోడ్డుపై వెండి కడ్డీలు కుప్పలుగా పెట్టి విక్రయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యం ప్రస్తుతం ఇంటర్‌నెట్ వేధికగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా రోడ్ల వెంట అమ్ముతున్నారు. ఇది ఫేక్ సిల్వర్ అనుకుంటున్నారేమో, మీకు ఆ సందేహం ఏం అవసరం లేదు. ఎందుకంటే.. ఇది పూర్తి స్వచ్ఛమైన వెండి అని చెబుతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఇక్కడ నుండి వచ్చింది. వెండిని అలా రోడ్ల వెంట ఎందుకు విక్రయిస్తున్నారో ఇక్కడ చూద్దాం..
వైరల్‌గా మారిన ఈ వీడియో చైనాకు చెందినదిగా తెలిసింది. చైనాలోని అతిపెద్ద బంగారు, ఆభరణాల కేంద్రమైన షుయ్‌బీలోని షెన్‌జెన్ లువోహు జిల్లాకు చెందినది. షుయ్‌బీ (水贝) ప్రాంతం చైనాలో అతిపెద్ద బంగారు ఆభరణాల కేంద్రంగా పిలుస్తారు.. ప్రతిరోజూ ఇక్కడ టన్నుల కొద్దీ బంగారం, వెండి కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయని సమాచారం. ఈ క్రమంలోనే ఇక్కడి ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వెండి కడ్డీలను ఏర్పాటు చేసిన విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులు కూడా పెద్ద సంఖ్యలో వాటిని కొంటున్నారు. ఇక్కడ అమ్మకానికి ఉన్న 15 కిలోగ్రాముల SGE వెండి స్లాబ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Chinese investors, and small industrials buying SGE 15 kg #Silver slabs from a dealer at ATH #Silver prices plus premium. pic.twitter.com/XtoUNbEaJM
— Eric Yeung 👍🚀🌕 (@KingKong9888) December 30, 2025
దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల తయారీదారులు, టోకు వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇక్కడ బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ఇక్కడ ప్రతిరోజూ పెద్ద ఎత్తున భౌతిక వెండి, బంగారు లావాదేవీలు జరుగుతాయి. భారీ బరువైన బంగారు, వెండి కడ్డీలను చూడటం అసాధారణ విషయం. సగటు వ్యక్తికి ఇది ఖచ్చితంగా ఇది కళ్లు బైర్లు కమ్మేసే దృశ్యం. అందుకే ఇలా రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్నట్టుగా వెండి కడ్డీలు అమ్మకాలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
A glimpse of 15 kg SGE #Silver slabs selling at the Shuibei (水贝) Shenzhen Luohu District China’s premier gold and jewelry hub. pic.twitter.com/mjvzVpxuTR
— Eric Yeung 👍🚀🌕 (@KingKong9888) December 30, 2025
ఇకపోతే, SGE అంటే షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్…చైనా అధికారిక, నియంత్రిత వస్తువుల మార్పిడి. SGE వెండి స్లాబ్‌లు ఒక నిర్దిష్ట స్వచ్ఛత (సాధారణంగా 99.9%) కలిగిన వెండి, పెట్టుబడి, నగల తయారీ. పారిశ్రామిక ఉపయోగం కోసం కూడా ఇక్కడ విక్రయాలు జరుగుతాయి. 15 కిలోల వెండి స్లాబ్ రిటైల్ కస్టమర్ల కోసం కాదని తెలిసింది. పెద్ద వ్యాపారులు, కార్పొరేట్ సంస్థల కోసం ఇక్కడ విక్రయాలు జరుపుతున్నారని తెసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..