Viral Video: ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు.. చదువుకుంటూనే…

జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడిపోతుంటాం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి

Viral Video: ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు.. చదువుకుంటూనే...
Viral

Updated on: Nov 25, 2021 | 1:57 PM

జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడిపోతుంటాం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి. కానీ ఆలోచనలను సరైన దారిలోకి తీసుకెళ్తే ఎంతటి పెను సమస్యలను కూడా సులభంగా మార్చుకోవచ్చు. ఆర్థిక సమస్యలతో కొట్టుమీట్టాడుతున్న కుటుంబానికి తనవంతు సాయం చేస్తూ అండగా ఉంటున్నాడు ఓ 13ఏళ్ల బాలుడు. ఓవైపు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తునే మరోవైపు సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ చేస్తూ సంపాదిస్తూ కుటుంబానికి భరోసాగా మారాడు. ఈ కుర్రాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ కుర్రాడి ప్రతిభ.. దైర్యంతో కూడిన మాటలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

విశాల్ అనే ఫుడ్ బ్లాగర్ తన షేర్ చేసిన వీడియోలో హర్యానాలోని ఫరీదాబాద్‏కు చెందిన 13ఏళ్ల దినేష్ అనే కుర్రాడు వీధిలో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్నాడు. వీధిలో మిరపకాయ స్ర్పింగ్ రోల్స్ చేస్తూ విక్రయిస్తున్నాడు. అయితే ఫుడ్ బ్లాగర్ విశాల్ ఆ యువకుడి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ బాలుడు పేరు, తల్లిదండ్రుల గురించి అడగ్గా.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఒక్క సెకన్ కూడా తను చేస్తున్న వంట మీది నుంచి దృష్టి తీయలేదు. తాను రోజూ స్కూల్ కు వెళ్తానని.. సాయంత్రం మాత్రమే తన స్టాల్ తెరిచి రాత్రి 8 లేదా 9 గంటల వరకు వంట చేస్తానని చెప్పాడు. తన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లుగా ఆ కుర్రాడు చెప్పాడు. దీంతో ఆ కుర్రాడి ఆలోచన విధానానికి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

Also Read: Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..

Shiva Shankar: విషమంగానే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడికి సోనూసూద్ ఫోన్..

Rashi Khanna Photos: ఆకట్టుకునే చూపులతో మనసు దోచుకుంటున్న ట్రెడిషనల్ డ్రస్‌లో రాశి ఖన్నా.. (ఫొటోస్)