Viral Video: వామ్మో.! ఎంత పెద్ద కొండచిలువ.? నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!

వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా..

Viral Video: వామ్మో.! ఎంత పెద్ద కొండచిలువ.? నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!
Python

Updated on: Aug 10, 2021 | 5:16 PM

వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు, వాటి వేటకు సంబంధించిన వీడియోలు అయితే తెగ హల్చల్ చేస్తుంటాయి. నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

జయ్ బ్రేవర్ అనే స్నేక్ క్యాచర్ ‘Jayprehistoricpets’ అనే సరీసృపాల జూను నడుపుతున్నాడు. ఇందులో వివిధ జాతులకు చెందిన కొండచిలువకు ఉన్నాయి. అతడు ప్రతీదాని గురించి వివరిస్తూ దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేస్తుంటాడు. ఇక ఆ వీడియోకు వేలల్లో లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చిపడతాయి. నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో పోస్ట్ చేశాడు.

సుమారు 113 కేజీల బరువు, 25 అడుగుల ఎత్తు ఉన్న కొండచిలువను తన భుజాలపై పెట్టుకుని తీసుకెళుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిని చూసి నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!