సరీసృపాలు.. ఈ మధ్యకాలంలో అడవిని, టం ఆవాసాలను విడిచిపెట్టి.. తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. చిన్న చిన్న పాములైతే.. ఏమాత్రం భయం లేకుండా తీసేయొచ్చు. కానీ అక్కడక్కడ భారీ కొండచిలువలు, కింగ్ కోబ్రాలు దర్శనమిస్తుండటంతో జనాల గుండె గుభేల్ అంటోంది. ఇటీవల సిల్చార్‌లోని అస్సాం యూనివర్శిటీ బాలికల హాస్టల్ సమీపంలో ఒక భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అది సుమారు 100 కిలోల బరువు, 17 అడుగుల పొడవు ఉన్న బర్మీస్ పైథాన్‌గా అధికారులు గుర్తించారు. ఇక బాలికలు ఈ పైథాన్‌ను చూసి దెబ్బకు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకోవడం.. పామును బంధించడంతో.. బాలికలు హమ్మయ్యా..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన డిసెంబర్ 18వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిల్చార్‌లోని అస్సాం యూనివర్సిటీ బాలికల హాస్టల్ సమీపంలో చోటు చేసుకుంది. సుమారు 100 కిలోల బరువున్న పెద్ద కొండచిలువ అనుకోని అతిధిలా హాస్టల్ సమీపంలో దర్శనమిచ్చింది. అక్కడున్న కేర్ టేకర్.. అలాగే మరికొంతమంది బాలికలు దాన్ని చూడగా.. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ సిబ్బంది సరైన సమయానికి ఘటనాస్థలికి చేరుకొని.. ఆ బర్మీస్ పైథాన్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కాగా, బరాక్ లోయ ప్రాంతాల్లో కనిపించే ఈ భారీ కొండచిలువలు.. మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. ఈ బర్మీస్ కొండచిలువలు ఎక్కువగా చిన్న జంతువులను వేటాడతాయి. అలాగే మనుషులను ఎటాక్ చేయడం, హాని చేయడం, ఇబ్బంది పెట్టడం లాంటివి చేయవు.
A giant 17-foot-long Burmese python, weighing approx 100 kilograms, was rescued from the Assam University campus in Silchar late on December 18, 2024. pic.twitter.com/GJhzvkxfJT
— World of Facts (@factostats) December 20, 2024
ఇది చదవండి: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్