Viral: కంటిలో ఏదో గుచ్చుతున్నట్టు అనిపించింది.. నొప్పితో పరుగున ఆస్పత్రికి వెళ్లగా

డాక్టర్లకు ఈ మధ్యకాలంలో చిత్రవిచిత్రమైన కేసులు వస్తున్నాయి. వాటిని చూస్తేనే షాక్ అవుతుంటే.. ఇక సాల్వ్ చేయడానికి తలలు పట్టుకుంటున్నారు. ఏదైతేనేం చివరికి బాధితులను రక్షిస్తున్నారు. అలాంటి ఓ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి ఈ స్టోరీ..

Viral: కంటిలో ఏదో గుచ్చుతున్నట్టు అనిపించింది.. నొప్పితో పరుగున ఆస్పత్రికి వెళ్లగా
Eye Operation

Updated on: May 15, 2025 | 12:20 PM

ముంబైలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల శివకుమార్ అనే వ్యక్తి కంటిలో నుంచి 10 సెంటీమీటర్ల పొడవున్న పురుగును శస్త్రచికిత్స ద్వారా బయటకు తొలగించారు వైద్యులు. స్థానిక వైద్యుల సమాచారం ప్రకారం.. సదరు రోగి కంటిలో నుంచి ఆ పురుగును అతి కష్టం మీద బయటకు తీశామని.. ఒకవేళ దాన్ని తొలగించకపోయి ఉంటే.. అది అతడి ప్రాణాలకే ప్రమాదంగా మారేదాని పేర్కొన్నారు. మొదటిగా ఆ పురుగు అతడి శరీరంలోకి ప్రవేశించి.. ఆపై కంటి దగ్గరకు చేరి ఉండొచ్చునని డాక్టర్లు తెలిపారు.

సదరు బాధితుడికి తొలుత కళ్లల్లో ఏదో గుచ్చుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత నొప్పి అకస్మాత్తుగా పెరగడంతో.. అతడు తన కళ్లల్లో కంటి చుక్కలు వేసుకుని పడుకున్నాడు. అయినా సరే అది తగ్గకపోగా.. ఆపై కంటి నుంచి రక్తస్రావం రావడం మొదలైంది. వెంటనే స్థానిక డాక్టర్‌ను సంప్రదించగా.. అతడి కంటిలో 10 సెం.మీ. పొడవున్న పురుగును చూసి దెబ్బకు నిర్ఘాంతపోయారు.

ఇవి కూడా చదవండి

ఆ పురుగు అతని గుండెకు చేరి ఉంటే.. గుండె సంబంధిత సమస్యలు వచ్చేవని.. మెదడుకు చేరి ఉంటే.. ప్రాణాంతకం అయ్యేదని డాక్టర్లు చెప్పారు. ఇక ఇది అరుదైన కేసు కావడంతో స్థానిక వైద్యుడు సవాల్‌గా తీసుకుని శస్త్రచికిత్స నిర్వహించాడు. సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. అతి కష్టం మీద ఆ పురుగును తొలగించారు.