ఎల్‌కే అద్వానీ
భారత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో లాల్ కృష్ణ అద్వానీ ఒకరు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన.. జాతీయ రాజకీయాల్లో చరగని ముద్రవేశారు. దేశ విభజనకు ముందు.. అంటే 1927 జూన్ 8న ఆయన ప్రస్తుత పాకిస్థాన్ భూభాగంలోని కరాచీలో జన్మించారు. దేశ విభజన అనంతరం అక్కడి నుంచి భారత దేశానికి వలస వచ్చి.. ఇక్కడి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్‌లో పలు కీలక పదవులు చేపట్టారు. 1970లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పదవి పొందారు. 1980లో బీజేపీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. 1998లో వాజ్‌పేయి సర్కారులో కీలకమైన హోం శాఖ పదవిని చేపట్టి.. 2004 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. 2004లో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచి యూపీఏ రెండోసారి అధికారంలోకి రావడంతో దేశ ప్రధాని కావాలన్న ఆయన కల నెరవేరలేదు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2024 ఫిబ్రవరి 3న భారత రత్న ప్రకటించింది
News not found!