స్లాంగ్‌ మార్చారు.. టాక్ అదరగొట్టారు..!!

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రారంభమైన.. మొదటిలో వచ్చిన చిత్రాలనుగుణంగా.. పాత్రల్లో వారి భాష.. నటన కనిపించేది. రానురానూ.. భాష కానీ.. చిత్రాల డైరెక్షన్‌గానీ రిచ్‌గా మారింది. అయితే.. ఓల్డ్‌ ఈజ్ గోల్డ్ అనుకున్నారేమో.. లేక.. కొత్తగా ట్రైచేద్దామనుకున్నారో.. గానీ.. గత కొద్ది కాలంగా.. టాలీవుడ్‌లో.. విలేజ్ నేటివిటీని ప్రతిబింబించేలా.. సినిమాలు.. రావడం ప్రారంభమయ్యాయి. సినిమాలు కానీ.. హీరోల.. నటన విషయంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో.. వారు చెప్పై డైలాగ్స్‌.. కిరాక్ పుట్టించాయి. సినిమాలు కూడా.. మంచి […]

స్లాంగ్‌ మార్చారు.. టాక్ అదరగొట్టారు..!!
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2019 | 9:13 PM

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రారంభమైన.. మొదటిలో వచ్చిన చిత్రాలనుగుణంగా.. పాత్రల్లో వారి భాష.. నటన కనిపించేది. రానురానూ.. భాష కానీ.. చిత్రాల డైరెక్షన్‌గానీ రిచ్‌గా మారింది. అయితే.. ఓల్డ్‌ ఈజ్ గోల్డ్ అనుకున్నారేమో.. లేక.. కొత్తగా ట్రైచేద్దామనుకున్నారో.. గానీ.. గత కొద్ది కాలంగా.. టాలీవుడ్‌లో.. విలేజ్ నేటివిటీని ప్రతిబింబించేలా.. సినిమాలు.. రావడం ప్రారంభమయ్యాయి. సినిమాలు కానీ.. హీరోల.. నటన విషయంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో.. వారు చెప్పై డైలాగ్స్‌.. కిరాక్ పుట్టించాయి. సినిమాలు కూడా.. మంచి హిట్‌లను అందుకున్నాయి.

ప్రస్తుతం ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. హీరోల పాత్రలతో పాటు.. యాసలోనూ చాలా మార్పులు వచ్చాయి. తెలంగాణ, రాయలసీమ, గోదావరి యాసలతో ఫ్యాన్స్‌ని అలరించి.. విజయం సాధించిన హీరోల గురించి తెలుసుకుందామా..!

1. రుద్రమదేవి: ‘నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా.. ఈడా ఉంటా’.. ‘గమ్మునుండవోయ్.. నీ మొలతాడులో నా తాయత్తు’.. అంటూ.. తెలంగాణ యాసలో.. ‘రుద్రమదేవి’ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్‌కి.. అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారనే చెప్పాలి. థియేటర్స్‌లో ఓ రేంజ్ అరుపులు.. ఈలలు వినిపించాయి. అనుష్క, రానా, అల్లుఅర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రుద్రమ దేవి సినిమా’ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

2. అరవింద సమేత వీర రాఘవ: ‘బాద్‌షా’ సినిమాలో.. తెలంగాణ యాసలో ఎన్టీఆర్‌ మాట్లాడినప్పటికీ.. అది పెద్దగా జనాల్లో క్లిక్‌ అవ్వలేదు. అనంతరం.. వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమలో.. రాయలసీమ యాసలో.. మాట్లాడి ఎన్టీఆర్ అదరగొట్టాడు. ‘ఏంది సామి..! ఏమి అనుకుంటున్నావ్’, ‘కంటపడ్డావా.. కనికరిస్తానేమో.. వెంటబడ్డానా.. నరికేస్తా ఓబా’, ‘ పాలిచ్చి పెంచిన ఆడవాళ్లకు.. పాలించడం చేత కాదా’ లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించారు.

3. రంగస్థలం: గోదావరి యాస నేపథ్యంలో.. చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. మెగాపవర్ స్టార్ రాంచరణ్‌కి వచ్చిన పేరు మరే నటుడికి రాలేదనే చెప్పాలి. రంగస్థలం సినిమాలో.. చెర్రీ నటించిన.. తీరుకి.. మాట్లాడిన యాసకి.. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా.. అందరూ.. ఫుల్ ఫిదా అయిపోయారు. ‘అయ్.. నా పేరు సిట్టిబాబు అండి’, ‘నన్ను అందరూ సౌండ్ ఇంజనీర్ అంటారు.. కానీ.. నా చెవుల్లో చేరిన మాట గుండెల్లో ఉండిపోతుంది’, ‘కుమార్ బాబుకు సిట్టిబాబు అనే ఒక తమ్ముడు ఉన్నాడు.. వాడిని ముట్టుకోవాలంటే.. ఈ సిట్టిబాబుగాడి గుండెకాయ దాటి యెల్లాలే’ అని చెర్రీ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు.

4. ఇస్మార్ట్ శంకర్: చాక్లెట్ బాయ్‌గా పేరుతెచ్చుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్‌ స్టార్ హీరో.. రామ్.. తాజాగా.. చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. అంతేకాకుండా.. రామ్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. కాలిపీలి లొల్లొద్దు’ అంటూ.. రామ్ చెప్పిన డైలాగ్స్ హైలెట్స్‌గా నిలిచాయి. పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Dhanush In Talks For Ismart Shankar Tamil Remake

5. వాల్మీకి: మొదట నుంచీ వైవిధ్యభరితమైన.. కథలను ఎంచుకుంటూ.. హిట్‌ సాధిస్తూ.. వచ్చాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా.. వరుణ్ తేజ్‌ చేసిన సినిమా ‘వాల్మీకి’ మాత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో.. వరుణ్ యాసకి.. యాక్టింగ్‌కి అందరూ అభిమానులయ్యారు. ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు