తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు – పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో BRS తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు షర్మిల వెల్లడించారు. గెలిచే అవకాశాలున్నాయి, ఈ పరిస్థితుల్లో అడ్డుపడొద్దని కాంగ్రెస్ పార్టీ తనను కోరిందని షర్మిల అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి