YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి డెడ్‌లైన్‌.. వైఎస్ షర్మిల ప్లాన్ బీ ఏంటంటే..?

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో పార్టీలన్నీ ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.. ఈ సమయంలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా..? కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం ఎప్పుడు..? ఈ నెలఖారు నాటికి విలీనం జరిగితే.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? విలీనం జరగకపోతే పరిస్థితి ఏంటి..?

YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి డెడ్‌లైన్‌.. వైఎస్ షర్మిల ప్లాన్ బీ ఏంటంటే..?
YS Sharmila

Updated on: Sep 26, 2023 | 1:15 PM

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో పార్టీలన్నీ ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.. ఈ సమయంలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా..? కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం ఎప్పుడు..? ఈ నెలఖారు నాటికి విలీనం జరిగితే.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? విలీనం జరగకపోతే పరిస్థితి ఏంటి..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని కార్యాలయంలో వైఎస్ షర్మిల అధ్యక్షతన వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. మొత్తం 33 జిల్లాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. అక్టోబరు రెండోవారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు షర్మిల. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్‌ పార్టీలో విలీనంపై సెప్టెంబరు 30 లోపు నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. విలీనం చేయకపోతే సొంతంగా బరిలోకి దిగుతామని షర్మిల ప్రకటించారు.

వాస్తవానికి విలీనంపై షర్మిల స్వయంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధిష్టానంతో మంతనాలు జరిపారు. కర్ణాటక పీసీసీ చీఫ్‌ శివకుమార్‌తోనూ ఆమె భేటీ అయ్యారు. అయితే తుమ్మల నాగేశ్వరరావును బెంగళూరుకు తీసుకెళ్లి శివకూమార్‌తో రేవంత్ భేటీ అయ్యాక.. పరిణామాలన్నీ మారిపోయాయి. తుమ్మల కాంగ్రెస్‌లో చేరడంతో షర్మిల డిమాండ్‌ చేస్తున్న పాలేరు టికెట్‌పై సందిగ్ధత ఏర్పడింది. షర్మిల చేరికను రేవంత్‌ మొదట్నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే, షర్మిల పార్టీ విలీనం వ్యవహారం కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలనలో ఉందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

షర్మిల చేరికపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకాచౌదరి కూడా గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌టీపీ-కాంగ్రెస్‌ విలీనం ప్రక్రియ మరిన్ని మలుపులు తీసుకోబోతోందని పరిశీలకులు చెబుతున్నారు.

అయితే, ఎన్నికలకు సమరశంఖం పూరించిన కాంగ్రెస్ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులు, సమీకరణాల ప్రకారం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ సమయంలో వైఎస్ఆర్టీపీ విలీనం అంశం మరోసారి తెరపైకి రావడంతో పాలేరు టికెట్ ఎవరికి దక్కుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..