YS Sharmila : చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ నిర్వహిద్దామని, పార్టీ విధి విధానాలపై అక్కడే ప్రకటన చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్ ఆఫీస్ లో ఆమె, ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలూ రెండు కళ్ళులా ఉండేవని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో పోడు భూములకు వైఎస్సార్ పట్టాలు ఇచ్చారని, రాజన్న సంక్షేమ పాలన కోసమే తాను ముందుకు వచ్చానని, అంతేకాని షర్మిలమ్మ రాజ్యం కోసం కాదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో దొరల కుటుంబ పరిపాలన పోవాలని, రాజన్న పరిపాలన రావాలని షర్మిల ఉద్ధాటించారు.
Read also : Tirupati By Election : తిరుపతి బైపోల్స్ లో చంద్రబాబు సరికొత్త వ్యూహం… ఆ నేతలకు కీలక బాధ్యతలు