Hyderabad: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమై.. ఓ యువతి మానాన్ని హరింపజేయాలని చూసింది. అది కూడా ఒక మహిళ.. మరో అమ్మాయి జీవితాన్ని నానశం చేయించాలనుకోవడం నగరంలో సంచలనం సృష్టించింది. తన భర్తతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ యువతిని కిడ్నాప్ చేయించింది వివాహిత. అమ్మాయి దుస్తులు విప్పించి వీడియోలు రికార్డ్ చేసింది. అంతటితో శాంతించని ఆ మహిళ.. నలుగురు యువకులతో అత్యాచారం చేయించబోయింది. ఆ అమ్మాయి టైమ్ బాగుండి.. వారి చెర నుంచి బయటపడింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి.. తనను కిడ్నాప్ చేయించిన, చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. తనను వేధింపులకు గురి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది యువతి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వివాహిత సహా.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.