తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. ఆమెతోపాటు సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు సునీతా లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. వి.సునీతా లక్ష్మారెడ్డి , గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి లకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
The newly appointed State Women’s Commission Chairperson Ms. V Sunitha Laxma Reddy, Members Ms. Gaddala Padma, Ms. Revathi Rao, Ms. Sudam Laxmi, Ms. Eshwari Bai, Ms. Shaheen Afroze, Ms. Kommu Uma Devi met CM Sri KCR today and thanked him. Hon’ble CM congratulated them. pic.twitter.com/RfjXNZuEKG
— Telangana CMO (@TelanganaCMO) December 28, 2020