
సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్‌కు వచ్చిన మహిళలు రెప్పపాటులో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం జహీరాబాద్‌లోని ఒక గోల్డ్ షాప్‌కు బంగారం కొందామని బురఖాలు ధరించిన నలుగురు మహిళలు వచ్చారు. ముక్కుపుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్‌లో ఉన్న సిబ్బంది వాళ్లకు అక్కడ ఉన్న డిజైన్లు చూపించడం మొదలుపెట్టారు.
ఇలా ఆ మహిళలు మాటలతో దుకాణ సిబ్బంది దృష్టిని మళ్లించారు. ఆమె వేరే డిజైన్ చూపించేందుకు వెనక్కి తిరగ్గా.. నలుగురిలోని ఓ మహిళ అక్కడే డెస్క్‌లో ఉన్న బంగారు ఆభరణాల పెట్టెను క్షణాల్లో మాయం చేసింది. సిబ్బంది మళ్లీ ఇటు తిరిగేలోపు ఆ బాక్స్‌ను దాచేసింది. కాసేపటికి మళ్లీ వస్తామని చెప్పి ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఆ మహిళలు షాపు నుంచి వెళ్లిపోయిన తర్వాత డెస్క్‌లో ఉన్న బంగారు ఆభరణాల ట్రే కనిపించకపోవడంతో కంగారుపడిన సిబ్బంది సీసీ కెమెరాలు చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
వీడియో చూడండి..
మాటల్లో పెట్టి రూ.10 లక్షలు విలువ చేసే బంగారం కొట్టేశారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఓ జ్యువెలరీ షాపులో కిలాడీ లేడీల చోరీ
ముక్కుపుడక కావాలని బుర్ఖా ధరించి షాప్ కి వచ్చిన నలుగురు మహిళలు
షాప్ సిబ్బందిని మాటల్లో పెట్టి క్షణాల్లో బంగారు ఆభరణాల బాక్స్ ని అపహరించిన మహిళలు… pic.twitter.com/4Vbs6hdwXk
— TV9 Telugu (@TV9Telugu) August 18, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.