Janagam District News: తెలంగాణలోని జనగామ జిల్ల బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎండ్రిన్ గుళికలను టీ పొడిగా భావించి అంజమ్మ అనే మహిళ టీలో వేసింది. గుళికల మందు కలిసిన టీ తాగిన అంజమ్మ మృతి చెందింది. అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉంటుంది. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విశాఖ జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యలోని లోటును ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. కొన్ని నెలలుగా విషాదాన్ని మనసులో భరిస్తూ వచ్చిన అతడు… తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికుల మనసులను కదిలించింది. సెక్యురిటీ గార్డుగా పని చేసే సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో మూత్రాసు కాలనీలో జీవనం సాగించేవాడు. ఆదాయం పెద్దగా లేకపోయినా.. ఉన్నంతలో ఆనందంగానే జీవించేవాడు. ఈ క్రమంలో విధి ఆ కుటంబాన్ని విచ్చిన్నం చేసింది.
సత్యనారాయణ భార్య పుష్పలత గతేడాది నవంబర్లో అనారోగ్యానికి గురై చనిపోయింది. నాటి నుంచీ కుంగుబాటుకు గురైన సత్యనారాయణ మంగళవారం రాత్రి పిల్లలు లోకేష్, తేజ శ్రీకి విషమిచ్చి అనంతరం ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇవాళ ఉదయం వృద్ధురాలైన అత్త నూకరత్నం… విగత జీవులుగా పడివున్న అల్లుడు, పిల్లలను చూసి షాక్‌కు గురైంది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే చుక్క కూడా వేస్ట్ చెయ్యరు
జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా ?.. డోంట్ వర్రీ.. పరిష్కారం ఇదిగో..!