Khammam: కూసుమంచిలో నడిరోడ్డుపై ధర్నాకు దిగిన మహిళ.. అప్పటి వరకు లేచేదే లేదంటూ..

|

Aug 20, 2022 | 9:59 PM

Khammam: ఖమ్మం జిల్లాలో ఓ మహిళ గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపేసింది. తనకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ ఇద్దరు చిన్నారులతో కలిసి రోడ్డును దిగ్బంధించింది.

Khammam: కూసుమంచిలో నడిరోడ్డుపై ధర్నాకు దిగిన మహిళ.. అప్పటి వరకు లేచేదే లేదంటూ..
Women Protest
Follow us on

Khammam: ఖమ్మం జిల్లాలో ఓ మహిళ గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపేసింది. తనకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ ఇద్దరు చిన్నారులతో కలిసి రోడ్డును దిగ్బంధించింది. వివరాల్లోకెళితే.. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓ మహిళ కుటుంబంతో కలిసి రోడ్డుపై ఆందోళనకు దిగింది. తన ఇద్దరు పిల్లలు, అవ్వతో కలిసి ప్రధాన రహదారిపై ధర్నా చేసింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగితిరిగీ అలసిపోయాను, తనకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదంటూ రోడ్డును దిగ్బంధించింది. తన ఇద్దరు పిల్లలు, అవ్వతో కలిసి ట్రాఫిక్‌ను ఆపేసింది మహిళ. రోడ్డుకు అడ్డంగా పడుకుని ఆందోళన చేయడంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

గట్టుసింగారంలో తనకున్న మూడున్నర ఎకరాల భూమిలో సాగు చేసుకోకుండా కొందరు అడ్డుపడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది బాధిత మహిళ. పట్టాతో సహా అన్ని డాక్యుమెంట్‌ తమ దగ్గరున్నా భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెబుతోంది. కోర్టు ఉత్తర్వులున్నా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది మహిళ. గట్టుసింగారంలో ఉండే లోడిగ వెంకన్న, లోడిగ లింగమ్మ, అనసూయమ్మ, కాంతారావు, బాలమన్సూర్‌పై ఆరోపణలు చేసింది. తమ భూమిలో తాము వ్యవసాయం చేసుకునేలా న్యాయం చేయమని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతోంది. పోలీసులకు కంప్లైంట్‌ చేస్తే, సెటిల్‌మెంట్ చేసుకోమని చెబుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటోంది. నాలుగేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఇద్దరు పిల్లలను, అవ్వను పోషించలేక ఇబ్బందులు పడుతున్నామ్ అంటోంది బాధిత మహిళ. పోలీసులు, గ్రామ పెద్దలు కూడా తమకు న్యాయం చేయడం లేదని వాపోతోంది. అధికారులు స్పందించి, తమ భూమిలో తాము వ్యవసాయం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలంటోంది మహిళ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..