AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ బస్సులో బానెట్పై కూర్చోవద్దన్నందుకు.. కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ!

అల్లరిమూకలు చెలరేగిపోయారు. మహిళకు మర్యాద ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు. కండక్టర్‌పై దాడి చేసిన వ్యక్తి, అడ్డొచ్చిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.

ఆర్టీసీ బస్సులో బానెట్పై కూర్చోవద్దన్నందుకు.. కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ!
Rtc Bus Conductor
Balaraju Goud
|

Updated on: Jul 31, 2024 | 11:37 PM

Share

అల్లరిమూకలు చెలరేగిపోయారు. మహిళకు మర్యాద ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు. కండక్టర్‌పై దాడి చేసిన వ్యక్తి, అడ్డొచ్చిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.

ఆత్మకూరు మండలం భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బందువులు వీరంగం సృష్టించారు. హన్మకొండ డిపో నుండి ఏటూర్‌నాగారం వెళుతుండగా ఆత్మకూరులో వాగ్వాదం జరిగింది. మొదట మహిళా ప్యాసింజర్ తో కండెక్టర్ కు తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల దాకా వెళ్ళింది.

ఏటూర్‌నాగారం వైపు వెళ్తున్న మహిళ ప్యాసింజర్ బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ పక్కన ఉండే ఇంజన్ బానెట్‌పై కూర్చున్నారు. అయితే అక్కడ కూర్చొవద్దని వారించిన కండక్టర్.. మహిళతో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఇక్కడే కూర్చుంటానని మహిళా ప్యాసింజర్ దురుసుగా వ్యవహారించింది. దీంతో మహిళా ప్యాసింజర్‌పై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బస్సు కండక్టర్. ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చేరవేసింది సదరు మహిళ.

దాంతో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల తరువాత బస్సును వెంబడి అడ్డుకున్నారు మహిళ కుటుంబసభ్యులు. బస్సుకు బైక్ అడ్డుగా పెట్టి కండక్టర్ పై దాడికి దిగాడు మహిళా ప్యాసింజర్ కొడుకు మోహన్. కాగా, ఈ ఘటనపై ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన మోహన్ కమలాపూర్ మండల వాసిగా గుర్తించారు.

వీడియో చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..