Rain Alert: తెలంగాణను వీడని వర్షాల ముప్పు.. మరో 2 రోజులు దంచుడే.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఆకాశం నుంచి ఆగకుండా వడగండ్లు కుస్తున్నాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా...మరి కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.

Rain Alert: తెలంగాణను వీడని వర్షాల ముప్పు.. మరో 2 రోజులు దంచుడే.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
Telangana Weather Report

Updated on: Mar 26, 2023 | 4:32 PM

తెలంగాణను ఇంకా వానల ముప్పు వీడలేదు. మరో 2 రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌,  నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జల్లులు పడవచ్చని, సోమవారం మాత్రం ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. వర్షం పడుతున్న సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద ఉంచవద్దని సూచించింది. ఇక రైతులు పంటలను జాగ్రత్త చేసుకోవాలని పేర్కొంది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఆకాశం నుంచి ఆగకుండా వడగండ్లు కుస్తున్నాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా…మరి కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల చేతికొచ్చిన పంట తడిసి ముద్దైంది. వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు మొక్కజొన్న పంట నష్టం జరిగింది.. మొక్కజొన్న పంట వందల ఎకరాల్లో నేలమట్టం కావడం..అటు కల్లాల్లో ఉంచిన మిర్చి పంట తడిసిపోయిదంటూ రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లా చెన్నూర్, నిర్మల్ జిల్లా కుంటాల , బైంసా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ , ఇచ్చోడ , తలమడుగు , తాంసిలో  మొక్కజొన్న, మిర్చి పంటలు నాశనమయ్యాయి. కరీంనగర్ జిల్లా…వీణవంక మండలంలో వడగళ్ళవానకి తీవ్ర నష్టం వాటిల్లింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..