Rain Alert: తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల జోరు పెరగనుంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం జులై 3 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Rain Alert: తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
Heavy Rains Alert For Telangana

Updated on: Jul 03, 2026 | 8:42 AM

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల జోరు పెరగనుంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం జులై 3 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ముఖ్యంగా జులై 3, 4 తేదీల్లో ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముండటంతో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అదేవిధంగా జులై 4, 5 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. జులై 5 నుంచి 8వ తేదీ వరకు కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా పంట పొలాల్లో నీటి నిల్వలు, గాలుల ప్రభావంపై జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన సూచనలు, హెచ్చరికలు కొనసాగిస్తామని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us