Adipurush: ఆదిపురుష్‌ చుట్టూ.. ముసురుతున్న వివాదాలు.. ఒకదాని వెంట ఒకటి

Prabhas: చరిత్ర వాస్తవికం.... సినిమా కల్పితం..!! ఆ రెండూ వేర్వేరు..!! అదే చరిత్రను తెరకెక్కిస్తే... వాస్తవికమా..? కల్పితమా అంటూ... ఎన్నో అనుమానాలు.. సందేహాలు ముందుకు వస్తాయి.. ఇప్పుడు ఆదిపురుష్‌ చుట్టూ కూడా... అలానే ఎన్నో వివాదాలు ముసురుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్ విడుదలైన నాటి నుంచి ఏదో ఒక అంశంతో వివాదాలు వెంటాడుతునే ఉన్నాయి.

Adipurush: ఆదిపురుష్‌ చుట్టూ..  ముసురుతున్న వివాదాలు.. ఒకదాని వెంట ఒకటి
Prabhas, Saif Ali Khan in Adipurush
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 10, 2023 | 9:29 PM

ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడి రూపం పదిలంగా ఉన్న సమయంలో… ప్రభాస్ మోడ్రెన్ రామాగా.. మరో బాహుబలిని తలపిస్తూ.. ఆదిపురుష్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్..! కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న.. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ.. ఇటీవల తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. అయితే.. ఈ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్ విడుదలైన నాటి నుంచి ఏదో ఒక అంశంతో వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి.

ఇప్పుడు ఆదిపురుష్‌లో పాత్రల లుక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. మీసకట్టుతో ప్రభాస్ రాముడిగా… నిజమైన మోడ్రెన్ రామగా కనిపిస్తున్నాడు. మరి మీసాల రాముడు ఎంతమందిని ఇంప్రెస్ చేస్తాడన్నది పక్కన పెడితే.. ఇప్పుడు మళ్లీ రాముడి రూపంపై చర్చ జరుగుతోంది. మీసాలు లేకుండా దేహం నీలివర్ణంలో ఉంటుందన్న నమ్మకంతో ఉంది భక్తలోకం. ఇప్పటికే రాముడికో రూపం ఇచ్చుకుంది భారతీయం. అలాగే… రామాయణంలోని ప్రతి పాత్రా ఇలాగే ఉంటుందని ఫిక్సైపోయాయి. పురాణాల్లో రాముడి రూపంపై వర్ణన ఉన్నా నిర్ధారణ లేదు. ఇప్పుడు రామాయణంలోని ప్రతి పాత్ర రూపాన్ని సరికొత్తగా చెక్కబడి వస్తోంది ఆదిపురుష్. ఇప్పుడు ఆదిపురుష్‌లోని శ్రీరాముని రూపంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ పోస్టర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు నటి కస్తూరి. ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ చూస్తే… నాకు అచ్చం కర్ణుడు గుర్తుకు వస్తున్నాడని… అసలు శ్రీరాముడికి, లక్ష్మణుడికి మీసాలు ఉండడం ఏంటని ప్రశ్నించారామె. టాలీవుడ్ లో ఇప్పటికీ ఎంతో మంది నటులు రాముడు పాత్రలో అద్భుతంగా కనిపించారు. కానీ, ప్రభాస్ మాత్రం రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు. రాముడు, లక్ష్మణుడికి గడ్డలతో చూపించిన సాంప్రదాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి మార్పులు ఎందుకు చేశారో అస్సలు అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించారు నటి కస్తూరి. అయితే, నటి కస్తూరి… తాజా వ్యాఖ్యలను కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనంతరం.. శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో కృతి సనన్‌ అండ్‌ ఓం రౌత్‌… కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు వివాదం అయ్యాయి. స్వామివారి శేష వస్త్రాలు ధరించి, శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో ముద్దు పెట్టుకోవడం ఏంటని భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే.. రామాయణం సీరియల్ లో సీతగా నటించిన దీపికా చిక్లియా కామెంట్స్ చేశారు. రామాయణ కథలో నటిస్తున్న మమ్మల్ని ప్రజలు దేవుళ్లుగా భావించేవారు. ఆ ఉద్దేశంతోనే మా కాళ్లకి నమస్కరించేవారు. వారి భక్తి భావన చూసిన మేము వారి నమ్మకానికి గౌరవం ఇచ్చేవాళ్ళం. హాగ్, ముద్దు పెట్టుకోవడం వంటివి చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎప్పుడు ప్రవర్తించలేదు. కానీ ఈతరం నటీనటులు అంత డెడికేషన్ తో ఉండలేకపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఆదిపురుష్‌ సినిమా డైరెక్టర్‌ ఓం రౌత్‌… వ్యాఖ్యలు కూడా వివాదం అవుతున్నాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్ ఓం రౌత్… ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా… హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్‌ సినిమా నడుస్తున్నప్పుడు ప్రతి థియేటర్‌లో ఒక సీటు ఖాళీగా ఉంచాలని ప్రొడ్యూసర్లను, డిస్ట్రిబ్యూటర్లను డైరెక్టర్‌ ఓం రౌత్ కోరారు. అయితే.. హనుమంతుడి కోసం.. సినిమా హాల్‌ లో ఒక సీటు వదిలి పెట్టాలనే ఓం రౌత్‌ వ్యాఖ్యలపై హేతువాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అహ్లాదాన్ని పంచే థియేటర్లను గుళ్లుగా మారుస్తున్నారా అంటూ అక్షేపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..