గోదారోళ్లను మరిపించారుగా మావ.. తెలంగాణ అల్లుడికి ఘాటైన విందు..! వీడియో చూస్తే అబ్బ అనాల్సిందే..

కొత్త అల్లుడికి మర్యాదలు అంటే గోదారే గుర్తొస్తుంది..! అది సంక్రాంతి పండుగ. మరి తెలంగాణలో..? అవును ఈ డౌట్ కు ఫుల్ స్టాప్ పెడుతూ ఓ అత్తామామ తన కొత్త అల్లుడికి భారీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అది కూడా తెలంగాణ అతి పెద్ద పండుగ దసరా రోజునా..! మర్యాదలలో గోదావరి జిల్లాల వారికి ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు.

గోదారోళ్లను మరిపించారుగా మావ.. తెలంగాణ అల్లుడికి ఘాటైన విందు..! వీడియో చూస్తే అబ్బ అనాల్సిందే..
101 Dishes To Son In Law In Telangana

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 04, 2025 | 7:31 PM

కొత్త అల్లుడికి మర్యాదలు అంటే గోదారే గుర్తొస్తుంది..! అది సంక్రాంతి పండుగ. మరి తెలంగాణలో..? అవును ఈ డౌట్ కు ఫుల్ స్టాప్ పెడుతూ ఓ అత్తామామ తన కొత్త అల్లుడికి భారీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అది కూడా తెలంగాణ అతి పెద్ద పండుగ దసరా రోజునా..!

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సహన, సురేష్ దంపతుల కూతురు సింధును గత నెలలో వరంగల్ పట్టణానికి చెందిన లిఖిత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత మొదటి పండగ విజయదశమికి అల్లుడు ఇంటికి రాగా పసందైన వంటలతో కొత్త అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలో మర్యాదలలో గోదావరి జిల్లాల వారికి ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నూట ఒక్క రకాల పిండివంటలతో విందు భోజనం సిద్ధం చేశారు. భారీ అరిటాకులో వంటకాలను వడ్డించి విందు భోజనం పెట్టారు. ముందే తెలివిలో చతురుడు అయిన అల్లుడు దసరాకు సరదాగా మామగారిని ఆటపట్టించాలని అన్ని ఒక్కొక్కటిగా లెక్కించడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే 101 కి బదులుగా 100 రకాల పిండి వంటలు మాత్రమే ఉన్నాయి. మామను ఎలాగైనా సరదాగా ఆటపట్టించాలని ఉద్దేశంతో ముందుగా చెప్పినట్టుగా నూట ఒక్క రకాలు కావాల్సిందేనని పట్టుబట్టాడు. లేనిపక్షంలో తులం బంగారం ఇవ్వాలని మారం చేశాడు. దీంతో అల్లుడు అడిగిన మొదటి కోరికను అడిగింది తడవుగా తులం బంగారం ఇవ్వక మామగారికి తప్పలేదు.

ఈ మామ అల్లుడి సరదా, కొత్త అల్లుడి విందు భోజనం కొత్తకోటలో అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ప్రతి ఇంట్లో అందరూ ఇలా సరదాగా పండుగలు జరుపుకుంటే బంధాలకు విలువ పెరుగుతుందని చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..