ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈపై దాడి చేశారు స్థానికులు. జనం మూకుమ్మడిగా రావడంతో ఆఫీస్ ఆవరణలో పరుగులు తీశారు ఏఈ. కారేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే హెల్పర్ మృతి చెందాడని ఏఈ విజయ్కుమార్ పై దాడి చేశారు గ్రామస్తులు. విద్యుత్ లైన్లు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కి గురై మృతిచెందాడు హెల్పర్ జర్పల వీరన్న. అతని కుటుంబానికి న్యాయం చేయాలని కారేపల్లి సబ్ స్టేషన్ ఎదుట బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపాయి కాంగ్రెస్, సీపీఎం.
వీరన్న మృతికి కారణం విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఏఈ విజయ్ కుమార్‌పై దాడికి చేశారు. గ్రామస్తుల నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశారు విజయ్. సబ్ స్టేషన్ గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు.
స్థానికుల అటాక్‌లో దాడిలో ఆయన షర్ట్ చిరిగిపోయింది. మీ నిర్లక్ష్యం వల్లే హెల్పర్ ప్రాణాలు పోయాయంటూ ఏఈపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు.