Big News Big Debate: విజయశాంతి, డీకే అరుణ మళ్లీ కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారా ? లైవ్ వీడియో..

|

Jun 24, 2022 | 10:19 PM

Big News Big Debate: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు.. కాంగ్రెస్, బీజేపీ దుకుడు పెంచాయి. ఈ క్రమంలో బలమైన ప్రత్యర్ధిగా కనిపించడానికి ఇరు పార్టీలు వలసలను కూడా నమ్ముకున్నాయి. అయితే కొంతకాలంగా బీజేపీ ఇందులో వెనకపడినట్టు కనిపిస్తుంటే... కాంగ్రెస్ మాత్రం దూకుడుమీద ఉంది. మొన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదేలు.. ఆయన సతీమణి భాగ్యలక్ష్మి. నిన్న పీజేఆర్‌ తనయ విజయారెడ్డి. నేడు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. ఇలా కాంగ్రెస్‌లో వరుస చేరికలు కేడర్‌లో జోష్‌ నింపుతున్నాయి. ఈ క్రమంలో హస్తం పార్టీ నుంచి బీజేపీలో చేరిన విజయశాంతి, డీకే అరుణ మళ్లీ కాంగ్రెస్‌లో చేరుబోతున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Jun 24, 2022 10:19 PM