ఎస్ఐ చనిపోయే ముందు రూమ్‌లో ఏం జరిగింది..? అలా నిరూపిస్తే ఉరి శిక్ష కైనా సిద్ధం.. యువతి సంచలన వ్యాఖ్యలు..

వాజేడు ఎస్‌ఐ హరీశ్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి అనూష సంచలన విషయాలు వెల్లడించింది. ఎస్‌ఐ హరీశ్‌ను తాను ఎలాంటి బ్లాక్‌ మెయిల్‌ చేయలేదని.. కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోతోంది. అతనికి వేరే పెళ్లి సంబంధం చూడడంతో ఇబ్బందిపడ్డారని.. తనను వదులుకోలేక.. పేరెంట్స్‌కు సమాధానం చెప్పలేకే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎస్ఐ చనిపోయే ముందు రూమ్‌లో ఏం జరిగింది..? అలా నిరూపిస్తే ఉరి శిక్ష కైనా సిద్ధం.. యువతి సంచలన వ్యాఖ్యలు..
Vajedu SI Harish Suicide case

Edited By:

Updated on: Dec 09, 2024 | 6:34 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్సై ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి అనూష సంచలన విషయాలు వెల్లడించింది. తానేవరిని బ్లాక్‌ మెయిల్‌ చేయలేదనీ, హరీష్ గొప్ప మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. ఎస్ఐ హరీష్ తనను ప్రేమించాడనీ చెబుతోంది. ఆత్మహత్య సమయంలో అతడి వద్దే ఉన్న యువతి.. తమ మధ్య ఉన్న సంబంధంపై పలు విషయాలు టీవీ9తో వెల్లడించింది. అతనికి వేరే పెళ్లి సంబంధం చూడడంతో ఇబ్బందిపడ్డారని.. తనను వదులుకోలేక.. పేరెంట్స్‌కు సమాధానం చెప్పలేకే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ హరీశ్‌ ఆత్మహత్యకు తాను కారణమని నిరూపిస్తే ఉరి శిక్ష కైనా సిద్ధం అంటోంది యువతి అనూష..

కేసు వివరాలివే..

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, దూదియా తండాకు చెందిన అనూష.. హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనూషకు ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడిన తర్వాత హరీష్.. ఎస్సై అని కొద్దిరోజుల తర్వాత తెలిసిందని అనూష చెబుతోంది. తన గతం తెలిసి.. మంచి జీవితాన్ని ఇస్తాను.. యాక్సెప్ట్ చేస్తావా.. అని హరిశ్ అడిగాడనీ, హరీష్ గొప్ప మనసున్న వ్యక్తి.. తనను ప్రేమించాడనీ అంటోంది. తన గతం తెలిసి హరీశ్‌ కొత్త జీవితం ఇస్తానని మాటిచ్చాడని.. దీంతో ఇద్దరం కలిసి సన్నిహితంగా ఉన్నామని, అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళమని యువతి చెబుతోంది. హైదరాబాదులో ఉంటున్న తన వద్దకు ప్రతి 20 రోజులకు ఒకసారి వచ్చేవాడని, హరీష్ నిజాయితీ కలిగిన వ్యక్తిగా చెబుతోంది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని భావించామని తెలిపింది.

వీడియో చూడండి..

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయలేదు..

పెళ్లి చేసుకోవాలని తాను హరీశ్‌ను ఒత్తిడి చేయలేదని, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేయలేదని అనూష స్పష్టం చేసింది. తన గతం గురించి అన్నీ తెలిసిన హరీశ్‌ కొత్త జీవితం ఇస్తానని మాటిచ్చాడని, ఆత్మహత్య చేసుకునే ముందు నిమిషం వరకు కూడా తనను ప్రేమించాడని అనుష చెబుతోంది. హరీష్ కు పెద్దలు కుదిర్చిన పెళ్లి విషయాన్ని తనకు చెప్పలేదనీ అంటోంది. ఏదో యాక్సిడెంట్ జరిగిందని తెలిసి వాజేడుకు వెళ్లానని చెబుతోంది. ఇద్దరికి పెళ్లి కావాలంటే తమ ఉన్నతాధికారుల ఎదుటనైనా, పోలీస్ స్టేషన్‌ ముందైనా, తన ఇంటివద్దనైనా ధర్నా చేయాలి’ అని సలహా కూడా ఇచ్చాడని.. అయినా తాను అంగీకరించలేదని అనూష చెబుతున్నారు.
ఆత్మహత్యకు ముందురోజు తాము ప్రైవేటు రిసార్టులో కలిశామని, ఇద్దరి మధ్య ఏ గొడవా జరగలేదని, హరీశ్‌ సోదరుడి సమక్షంలోనే పెళ్లి గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. హనుమకొండలో పెళ్లిచేసుకుందామని చెప్పి తనను వాహనం వద్దకు వెళ్లాలని పంపించిన హరీశ్‌.. గడియ పెట్టుకొని తుపాకీతో కాల్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఆ సమయంలో ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని వాపోయింది. తనను మోసం చేయాలని ఆలోచన హరీష్ కు ఏ కోశానా లేదని అనూష చెబుతోంది. తనను వదులుకోలేక.. తల్లిదండ్రులకు చెప్పలేక మానసిక ఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడనీ ఆవేదన వ్యక్తం చేసింది.

నేనెవరిని.. బ్లాక్ మెయిల్ చేయలేదు..

తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, తాను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని అనూష చెబుతోంది. తన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తానని విచారణ జరిపించుకోవచ్చని అంటున్నారు. హరీష్ ఆత్మహత్యకు తానే కారణమైతే ఏ శిక్షకైనా సిద్ధమేనని అనూష పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..