‘తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం’.. భువనగిరి సభలో కేంద్రమంత్రి అమిత్ షా..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మూడో సారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలా వద్దా అని ప్రజలను అడిగారు. బీజేపీ 400 సీట్లు రావాలా వద్దా అని ప్రశ్నించారు. దీనికి బహిరంగ సభా ప్రాంగణం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. అయితే భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరారు. 2024 ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ మధ్య నడుస్తున్నాయన్నారు. కుటుంబ అభివృద్ది దేశాభివృద్ది మధ్య నడుస్తున్న ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు.

'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. భువనగిరి సభలో కేంద్రమంత్రి అమిత్ షా..
Amith Shah
Follow us

|

Updated on: May 09, 2024 | 1:51 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మూడో సారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలా వద్దా అని ప్రజలను అడిగారు. బీజేపీ 400 సీట్లు రావాలా వద్దా అని ప్రశ్నించారు. దీనికి బహిరంగ సభా ప్రాంగణం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. అయితే భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరారు. 2024 ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ మధ్య నడుస్తున్నాయన్నారు. కుటుంబ అభివృద్ది దేశాభివృద్ది మధ్య నడుస్తున్న ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాహుల్ పిల్ల చేష్టల్లాంటి గ్యారెంటీలు, మోదీ కచ్చితమైన గ్యారెంటీల మధ్య జరుగుతున్నాయన్నారు. ఇప్పడు దేశ వ్యాప్తంగా మోదీ నామస్మరణ వినిపిస్తోందని తెలిపారు. ఇప్పటికే బీజేపీ మూడు విడతల లోక్ సభ ఎన్నికల్లో 200 స్థానాలకు మించి గెలిచిపోయిందని జోస్యం చెప్పారు. ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ కు చురకలు అంటించారు.

సీఎం రేవంత్ విను ఈసారి బీజేపీ 10 కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలవబోతున్నాం అని అన్నారు. తెలంగాణలో డబుల డిజిట్ స్థానాల్లో గెలిస్తే దేశంలో 400 స్థానాల్లో గెలిచినట్లే అని చెప్పారు. భువనగిరిలో రాహుల్ గాంధీకి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన హామీలు అమలు కాలేదన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, వరి, గోధుమలకు రూ. 500 బెనస్ ఇస్తామన్నారు. ఇంకా అమలు చేయలేదన్నారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. 70 ఏళ్లుగా రామమందిర నిర్మాణాన్ని చేపట్టకుండా జాప్యం చేశారని చెప్పారు. గతంలో మోదీ శపథం చేసినట్లు రామమందిర నిర్మాణాన్ని అద్భుతంగా నిర్మించి జాతికి అంకితం చేశారన్నారు. దేశంలో నక్సలిజం, ఉగ్రవాదాన్ని మోదీ సమాప్తం చేశారని కొనియాడారు. టెక్స్ టైల్ రంగంలో మోదీ 8 లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..