Telangana: పెద్దపల్లిలో విజయ నిర్ణేతలు వీళ్లే.. ప్రచారంలో జోరు పెంచిన ప్రధాన పార్టీలు..

సింగరేణి ఓట్ల పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. పేరుకు తగ్గట్టే అది పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో విస్తరించి ఉన్న ఆ నియోజకవర్గంలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం. దీంతో కార్మిక కుటుంబాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరంగా చేస్తున్నారు. కార్మికుల ప్రధాన సమస్యలను ఎజెండాలుగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా కొనసాగుతోంది.

Telangana: పెద్దపల్లిలో విజయ నిర్ణేతలు వీళ్లే.. ప్రచారంలో జోరు పెంచిన ప్రధాన పార్టీలు..
Telangana Elections
Follow us

| Edited By: Srikar T

Updated on: May 09, 2024 | 11:40 AM

సింగరేణి ఓట్ల పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. పేరుకు తగ్గట్టే అది పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో విస్తరించి ఉన్న ఆ నియోజకవర్గంలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం. దీంతో కార్మిక కుటుంబాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరంగా చేస్తున్నారు. కార్మికుల ప్రధాన సమస్యలను ఎజెండాలుగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కాకా వెంకటస్వామి మనుమడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తుండగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బిజెపి అభ్యర్థిగా గోమాస. శ్రీనివాస్ రెండవసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. ఈ ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజల్లో పట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే, కీలకమైన సింగరేణి కార్మిక కుటుంబాల మద్దతుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలను ప్రభావితం చేసే సత్తా సింగరేణి కార్మికులది.

ఈ విషయాన్ని గ్రహించిన ప్రధాన పార్టీలు, సింగరేణి కార్మిక కుటుంబాల మద్దతు కోసం విస్తృతంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ INTUC సత్తా చాటుకోవడం, సింగరేణి గుర్తింపు సంఘమైన AITUC మద్దతును ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి అనుకూలించే అంశాలుగా ఆ పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ స్వతహాగా సింగరేణి కార్మికుడు కావడం, కార్మిక ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించిన చరిత్రను కలిగి ఉండడం ఆయన గెలుపుకు లాభించే అంశాలుగా బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకోవైపు బిజెపి అభ్యర్థి కూడా సింగరేణి కార్మిక కుటుంబాల మద్దతు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో గెలుపు ఓటములను నిర్ధారించే సింగరేణి కార్మికులు అంతిమంగా ఎటువైపు మొగ్గుచూపుతారనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..