సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..

లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. మే 17న లండన్‎కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‎లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సీఎం జగన్ మే 13 పోలింగ్ తరువాత లండన్ టూర్ ప్లాన్ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు హర్షితా రెడ్డి, వర్షితా రెడ్డిలతో సరదాగా గడిపేందుకు తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. ప్రతి ఏటా సీఎం జగన్ తన ఇద్దరు కుమార్తెలు వద్దకు వెళ్తూ ఉంటారు.

సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
Cm Jagan
Follow us

|

Updated on: May 09, 2024 | 1:17 PM

లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. మే 17న లండన్‎కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‎లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సీఎం జగన్ మే 13 పోలింగ్ తరువాత లండన్ టూర్ ప్లాన్ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు హర్షితా రెడ్డి, వర్షితా రెడ్డిలతో సరదాగా గడిపేందుకు తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. ప్రతి ఏటా సీఎం జగన్ తన ఇద్దరు కుమార్తెలు వద్దకు వెళ్తూ ఉంటారు. గతంలో 2019 ఎన్నికల సమయంలోనూ సీఎం జగన్ పోలింగ్ ముగించుకుని కూతుళ్ల వద్దకు వెళ్లి కౌంటింగ్‎కు ముందు తిరిగి భారతదేశానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎన్నికలు ముగించుకుని లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీని కోసం అబ్రాడ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సీబీఐకి కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీనిపై సీబీఐ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

సీఎం జగన్‎కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సీఎం జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నయని, విచారణ జరుగుతున్న సమయంలో విదేశాలనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని న్యాయమూర్తికి తెలిపారు. ఈ కేసులన్నింటిలో సీఎం జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారని సీబీఐ వాదించింది. పైగా మే15న జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. గతంలో కూడా సీఎం జగన్ అనేక సార్లు విదేశాలకు వెళ్లారని ఎక్కడ కూడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని న్యాయమూర్తికి తెలిపారు. రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కాలరాయడం సరైన విధానం కాదని సీఎం జగన్ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. సీఎం జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని, ఆయనను నమ్ముకుని పార్టీ ఉందని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడరని వివరించారు. అందుకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు న్యాయవాదులు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తీర్పును మే 14కు వాయిదా వేసింది. సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ అటు అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
ఆ మున్సిపాలిటీ‎లో అవిశ్వాస సెగలు.. చైర్మన్ పదవికి తప్పని గండం..
ఆ మున్సిపాలిటీ‎లో అవిశ్వాస సెగలు.. చైర్మన్ పదవికి తప్పని గండం..
దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..