Telangana: తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..

అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంత్రి కిషన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‎గా కూడా కొనసాగుతున్నారు తమిళిసై. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Telangana: తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
Former Governor Tamilisai
Follow us

|

Updated on: May 09, 2024 | 12:41 PM

అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంత్రి కిషన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‎గా కూడా కొనసాగుతున్నారు తమిళిసై. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర రూపాలను సామాన్యులకు పంచిపెట్టారు. దీనినిపై బీఆర్ఎస్ స్పందించి ఉద్దేశపూర్వకంగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం దీనికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీకి పేర్కొంది. దీంతో పాటు మరో కీలక అంశాన్ని పొందుపరిచింది.

మతం ఆధారంగా బీజేపీ పార్టీని ప్రోత్సహించాలని, రామమందిర ప్రతిరూపాలను సామాన్య ప్రజలకు పంపిణీ చేశారని బీఆర్‌ఎస్ పేర్కొంది. ఇది చట్టవిరుద్దమైన చర్యగా భావించి తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిర రూపాలను పంచడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు. మతపరమైన చిహ్నాలను పంపిణీ చేయడం ద్వారా ఓ వర్గం ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు తమిళిసై పాల్పడ్డారని పేర్కొంది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా నిష్పాక్షపాతంగా నిర్వహించేలా చూడాలని బీఆర్ఎస్ ఈసీని కోరింది. తమిళిసై సౌందరరాజన్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..