కూతుర్ని ప్రేమించాడని బలవంతంగా బీర్ తాపించిన మేనమామ.. పాపం, చివరకు మేనల్లుడు..

|

Apr 18, 2023 | 11:48 AM

మేనమామ కూతురిని ప్రేమించడమే అతని పాపమైంది.. సొంత మేనమామే తన మేనల్లుడిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామానికి చెందిన అనిల్‌ తన మేనమామ కూతురుని ప్రేమించాడు.

కూతుర్ని ప్రేమించాడని బలవంతంగా బీర్ తాపించిన మేనమామ.. పాపం, చివరకు మేనల్లుడు..
Crime News
Follow us on

మేనమామ కూతురిని ప్రేమించడమే అతని పాపమైంది.. సొంత మేనమామే తన మేనల్లుడిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామానికి చెందిన అనిల్‌ తన మేనమామ కూతురుని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అనిల్ ని ఇష్టపడింది. కానీ ప్రతి కథలో ఓ విలన్ ఉన్నట్లుగానే వీరి కథలో యువతి తండ్రే కాలయముడయ్యాడు. తన కూతుర్ని ప్రేమిస్తున్న మేనల్లుడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన మట్టుబెట్టాలని పథకం వేశాడు.

దీనిలో భాగంగా.. ఆ యువకుడిని మాట్లాడే పనుందని చెప్పి మేనమామ లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోకి తీసుకెళ్లాడు. తను ముందుగానే బీరులో గడ్డిమందు కలిపి సిద్దంగా ఉంచుకున్నాడు. అల్లుడిని కత్తితో బెదిరించి బీర్ తాగించాడు. ఆ తర్వాత.. అనిల్ అపస్మారక స్థితిలోకి వెల్లగానే మేనమామ అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ తర్వాత ఆసుపత్రిలో చేరిన యువకుడు చికిత్స పొందుతూ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు.

అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కానీ, చనిపోడానికి ముందు మాత్రం తాను అనుభవించిన నరకాన్ని చెప్పాడు. మామ ఎలా కత్తిపట్టుకుని బెదిరించాడో, ఎలా పురుగుమందు బీరులో కలిపి తాగించాడో వివరించాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేనమామపై కేసు నమోదు చేశారు పోలీసులు.. వీడియో ఆధారంగా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేనమామ.. మేనల్లుడిని చంపడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ దుర్మార్గుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..