కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. అభివృద్ధి అంటే ప్రజలు ఆత్మగౌరవంతో బతకడానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు కోదండరాం. అలాంటి అభివృద్ధి తెలంగాణలో రాలేదన్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్ల ఊసెత్తడం తప్ప.. అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు కోదండరాం.