తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 16 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ పాఠశాలల అదనపు సంచాలకుడు రమణకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 7 నుంచి 10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. దాదాపు 70,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ స్కూల్ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్ 16న (ఆదివారం) నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మోడల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.