కరోనా బాధితులతో ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్

|

Sep 18, 2020 | 8:44 PM

కరోనా బారిన పడిన బాధితులను టెలీ కాన్ఫరెన్స్ లోకి తీసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులు...

కరోనా బాధితులతో ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్
Follow us on

కరోనా బారిన పడిన బాధితులను టెలీ కాన్ఫరెన్స్ లోకి తీసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో, మండలాలలో కరోనా పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లి అధికారులను ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరు అధైర్య పడొద్దని బాధితులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సర్పంచ్ లు, నాయకులు కరోనా బారిన పడిన బాధితులకు అండగా నిలవాలని.. వారికి ధైర్యం చెప్పాలని కోరారు. అలాగే ఈ కరోనా కష్టకాలంలో ‘దయన్న స్పెషల్ ఫోర్స్’ సభ్యుల సేవలను ఆయన కీర్తించారు. ఎప్పటికప్పుడు కరోనా బారిన పడిన బాధితులకు అండగా ఉంటూ నిత్యావసర సరుకులను అందిస్తున్నారని.. మరోసారి ఇదే తరహా సేవలు అందించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.