Karimnagar: ఉద్యోగాల పేరిట రూ.20 కోట్ల టోకరా.. వలపన్ని కేటుగాడిని అరెస్టు చేసిన సిరిసిల్ల పోలీసులు

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ధర్మారంకు చెందిన రమేష్ చారి హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠాను ఏర్పాటు చేసి మోసాన్ని అలలీలగా చేయడం రమేష్ నైజం. అధికార పార్టీ నాయకులతో ఫోటోలు దిగడం వాటిని అమాయకులైన వారికి చూపెట్టి మోసం చేయడంలో దిట్ట. ఏకంగా సీఎం కేసీఆర్ పేరును వాడుతూ, కేసీఆర్ సేవాదళం అనే సంస్థ ఏర్పాటు చేసి కర్త, క్రియ నేను అంటూ..

Karimnagar: ఉద్యోగాల పేరిట రూ.20 కోట్ల టోకరా.. వలపన్ని కేటుగాడిని అరెస్టు చేసిన సిరిసిల్ల పోలీసులు
Ramesh Chari

Edited By: Srilakshmi C

Updated on: Jul 30, 2023 | 8:40 AM

సిరిసిల్ల, జులై 30: సినిమా టైటిల్ పేర్లకు మించి పోయేలా బ్లఫ్ మాస్టర్ సినిమా చూపెట్టిన ఇతడు చేసిన మోసాలకు పోలీసులే షాక్ అయ్యారు. ఇంతకీ ఎవరా మోసగాడు? అంటే సినిమా రేంజ్ లో ఉండేలా ఉంటది. ఏమిటా కథ అనుకుంటున్నారా? ఆన్లైన్‌లో వస్తువులు తక్కువ రేటుకు అంటూ ఆశచూపి లక్షలు, కోట్ల డబ్బు హాంఫట్‌ చేశాడు. పోలీసులకు చిక్కడం మళ్ళీ అదే దందా మొదలెట్టడం అదే అతని తంతు. తాజాగా ఇతగాడి కళాపోషణను సిరిసిల్ల పోలీసులు బయటపెట్టారు. వివరాల్లోకెళ్తే..

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ధర్మారంకు చెందిన రమేష్ చారి హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠాను ఏర్పాటు చేసి మోసాన్ని అలలీలగా చేయడం రమేష్ నైజం. అధికార పార్టీ నాయకులతో ఫోటోలు దిగడం వాటిని అమాయకులైన వారికి చూపెట్టి మోసం చేయడంలో దిట్ట. ఏకంగా సీఎం కేసీఆర్ పేరును వాడుతూ, కేసీఆర్ సేవాదళం అనే సంస్థ ఏర్పాటు చేసి కర్త, క్రియ నేను అంటూ ప్రగల్బాలు చెబుతూ, పరిచయస్తులను తన ముగ్గులోకి దింపడం ఇతని నైజం.

ఇతగాడి సూటు, బూటు, కల్పిత మాటలు చూసి కొందరు అమాయకులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి లక్షలు ఇవ్వగా, వారందరికీ కుచ్చుటోపీ అసహించుకునెలా తన మాటల గారడీతో ఇదిగో ప్రభుత్వ ఉద్యోగం అంటూ… చెబుతూ… నమ్మబలికేవాడు. ఇది బయట పడిన కొన్ని రోజులకు ఆన్లైన్ లో వస్తువులు తక్కువ రేటు అని పెట్టి ఆశపడి కొనుక్కునే వారి దగ్గరికి కొందరికి పంపించి నమ్మిస్తాడు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో అర్దర్లు రాగానే జెండా ఎత్తేయడం, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ మోసగానికి వెన్నెతో పెట్టిన విధ్య.

ఇవి కూడా చదవండి

ఇలానే గత కొంతకాలంగా రమేష్ చారి దాదాపుగా 40 నుండి 50 కోట్ల వరకు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలపై పోలీసులు దృష్టిపెట్టి వలపన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం రమేష్ చారిని సిరిసిల్ల రూరల్ పోలీసులు అదుపులో ఉన్నాడు. అతను చేసిన నయా మోసలపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. అసలు రమేష్ చారి వెనుక ఎవరున్నారు ? ఆయనను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? సాధారణ కుటుంబం నుండి హైదరాబాద్ వెల్లిన రమేష్ చారి ఇంత మోసాలు ఎలా చేస్తున్నాడనే కోణంలో దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.