Balka Suman: పాలన చేతకాక ఏడ్చిన ప్రధాని ఇతనే.. బీజేపీ చరిత్ర అంటే ప్రజల్ని లైన్లో నిల్చోబెట్టడమే: బాల్కా

Balka Suman: పాలన చేతకాక ఏడ్చిన ప్రధాని ఇతనే.. బీజేపీ చరిత్ర అంటే ప్రజల్ని లైన్లో నిల్చోబెట్టడమే: బాల్కా
MLA Balka Suman

పాలన చేతకాక ఏడ్చిన ప్రధానిని ఎక్కడా చూడలేదని హాట్ కామెంట్స్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్. బీజేపీ చరిత్ర అంటే ప్రజలని

Venkata Narayana

|

Aug 21, 2021 | 3:23 PM

TRS MLA Balka Suman: పాలన చేతకాక ఏడ్చిన ప్రధానిని ఎక్కడా చూడలేదని హాట్ కామెంట్స్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్. బీజేపీ చరిత్ర అంటే ప్రజలని లైన్లో నిల్చోబెట్టడమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఫోటోలు దిగడం తప్ప బీజేపీ నేతలు, ప్రజల పొట్టతిప్పలు పట్టించుకోరని సుమన్ చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో ప్రధాని రాజీనామా చేయాలని 14 కోట్ల మంది కోరారని గుర్తు చేసిన బాల్కా సుమన్.. దేశంలో అన్నింటికీ కొరతేనని ఎద్దేవా చేశారు. “జన యాత్రలో కిషన్ రెడ్డి తన స్థాయి కేంద్ర మంత్రని మర్చిపోయి మాట్లాడుతున్నారు.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రిగా మొదటి సారి తెలంగాణకు వచ్చారు.. నాలుగు మంచి మాటలు మాట్లాడతారు అనుకుంటే ఏదేదో అంటున్నారు.” అని బాల్కా విమర్శించారు.

“కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు.. వారసత్వ రాజకీయాలు టీఆర్ఎస్ లోనే ఉన్నాయా? మీ పార్టీలో ఉన్న సీనియర్ల వారసత్వంగా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఉన్నారు.. బీజేపీ అంటే అమ్మకం టీఆర్ఎస్ అంటే నమ్మకం. అంబానీ అధాని ఆస్తులు పెరిగుతున్నాయి. సామాన్యజనం అడుగంటి పోతున్నారు” అని బాల్కా సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read also: Vishwakarma: విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : అధ్యక్షుడు నరసింహచారి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu