Donation for Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సహా టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నేత భారీ విరాళం.

Donation for Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి దేశంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగానూ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

Donation for Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సహా టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నేత భారీ విరాళం.

Updated on: Feb 05, 2021 | 4:34 AM

Donation for Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి దేశంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగానూ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించతలపెట్టిన రామమందిరానికి టీఆర్ఎస్ నేత, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రూ. 51,000 విరాళం ఇచ్చారు. ఆయనతో పాటు వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం భారీగా విరాళాలు ఇచ్చారు. మొత్తంగా రూ. 3 లక్షల నగదును రామ మందిరం నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. కాగా, రామాలయ నిర్మాణం కోసం మైనార్టీ నేత, మాజీ జెడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్ కూడా విరాళం ప్రకటించారు. రామాలయానికి తన వంతు సాయం కింద రూ.11,000 విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ సహా నేతలు మాట్లాడారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలంతా తమకు తోచినంత సాయం చేయాలని సూచించారు.

Also read:

India Vs England 2021-22: తండ్రి అవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..

ED Officers: మెహుల్ చోక్సీకి మరోసారి షాక్ ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు..