Trainee Chopper crashes in Nalgonda: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో మినీ విమానం కుప్పకూలంది. ఒక్కసారిగా కింద పడటంతో తునాతునకలైంది. ఈ ప్రమాదం (training helicopter crash) లో మహిళ పైలట్‌తో పాటు, ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. పెద్దవూర మండలం తుంగతుర్తిలో విద్యుత్ స్తంభంపై కూలిన విమానం ముక్కలు ముక్కలైపోయింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఘటనా స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నారు.
ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా 152 మోడల్ టూ సీటర్ చాపర్ కుప్పకూలింది. నాగార్జున సాగర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ హెలికాప్టర్ సాంకేతిక సమస్యలతో కూలింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయంటున్నారు నిపుణులు. టేకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే కూలింది విమానం. నాగార్జున సాగర్ ఎయిర్ బేస్ నుంచే ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఫ్లైటెక్ ఏవియేషన్. కూలిన హెలికాప్టర్ CESSNA-152.
ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అసలేం జరిగింది? ప్రమాదానికి కారణాలేంటని ఆరా తీస్తోంది ఏవియేషన్ సంస్థ.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను వీడియోలో చూడండి..
Also Read: