రేపు హోలీ పండుగ రాబోతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు పండుగను జరుపుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్స్ వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా హోలీకి సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ హోలీ కోసం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించింది. మార్చి 25వ తేదీ సోమవారం తెలంగాణ ప్రభుత్వం కూడా పండుగకు సెలవు ప్రకటించింది.
గుడ్ ఫ్రైడే రోజున హైదరాబాద్ లోని పాఠశాలలకు కూడా సెలవు ఉంటుంది. ఇక ఏసుక్రీస్తును శిలువ వేసినందుకు గుర్తుగా క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే రోజున పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. ఇక ఈ ఏడాది మార్చి 29న సాధారణ సెలవు దినంగా ప్రకటించారు. దీంతో పాటు హైదరాబాద్ లోని కొన్ని పాఠశాలలకు మార్చి 31న ఐచ్ఛిక సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణతో సహా భారతదేశం అంతటా హోలీ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగను పురస్కరించుకుని మార్చి 25న సెలవు ఉంటుందని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
హోలిను పురస్కరించుకొని పలు చోట్లా కామ దహనం కార్యక్రమం జరుగుతోంది. హోళిక అనే రాక్షసుడిని దహనం చేసినందుకు సంబరాలు చేసుకోవడానికి మంటలు వెలిగిస్తారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుఃఖంపై ఆనందం సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. హోలీకి ముందు రోజు రాత్రి నార్త్ ఇండియాతో పాటు పలు ప్రాంతాల ప్రజలు ఈ సంప్రదాయానికి అనుగుణంగా కామ దహనం చేస్తారు. ఇది వసంతాన్ని జరుపుకునే రంగుల పండుగ హోలీకి ముందు ఉంటుంది.