Tiger Fear: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం.. ఆవును ఈడ్చుకెళ్లిన పెద్దపులి.. నిర్ధారించిన అధికారులు..

|

Dec 28, 2020 | 6:14 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పులుల సంచారం తీవ్ర కలకం రేపుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి..

Tiger Fear: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం.. ఆవును ఈడ్చుకెళ్లిన పెద్దపులి.. నిర్ధారించిన అధికారులు..
Follow us on

Tiger Fear: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పులుల సంచారం తీవ్ర కలకం రేపుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి పులి కలకలం రేగింది. ఆశ్వారావుపేట మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. అటవీ ప్రాంతంలో మేత మేస్తున్న ఎద్దుపై దాడి చేసి చంపేసింది. ఆపై 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. అది చూసిన పశువుల కాపరి అక్కడి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. పులి సంచారం విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒంటరిగా ఎవరూ అడవిలో వెళ్లొద్దని సూచించారు. అలాగే పశువులను అడవిలో మేపొద్దని సూచించారు.

 

Also read:

కొత్త తరహా వాహనాలపై మహేంద్రా లాజిస్ట్రిక్స్ ఫోకస్..డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్‌ వాహనాలు

బాలయ్య సినిమాలో కన్నడ స్టార్‌ హీరో..? పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న పునీత్‌ రాజ్‌.