TG Weather: కూల్ న్యూస్.. రాష్ట్రంలో తగ్గనున్న టెంపరేచర్లు.. పైగా వర్షాలు..

రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొంది. తెలంగాణ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

TG Weather: కూల్ న్యూస్.. రాష్ట్రంలో తగ్గనున్న టెంపరేచర్లు.. పైగా వర్షాలు..
Telangana Weather Report

Updated on: May 12, 2025 | 7:30 AM

సోమవారం, మంగళవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ  26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

ఇక రాగల మూడు రోజులలో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం గరిష్టంగా ఖమ్మంలో 41.4, కనిష్టంగా హైదరాబాద్‌లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది

మే 11, ఆదివారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. మెదక్.. 41.7,
నిజామాబాద్.. 41, ఆదిలాబాద్.. 39.8,  ఖమ్మం.. 39.4, నల్లగొండ.. 39, మహబూబ్ నగర్.. 39, రామగుండం.. 38.8, హైదరాబాద్.. 38.2, భద్రాచలం.. 38.2,  హనుమకొండ.. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Loading...
Unable to load recommendations.
Follow Us