Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైకి చూస్తే కస్టమర్లు అనుకునేరు.. తిప్పి చూస్తే.. పైట చాటున చెడుగుడు యవ్వారం.!

ఆ ముగ్గురు మహిళలు కస్టమర్లుగా స్వీట్ షాప్‌నకు వచ్చారు. షాప్ యజమాని ఎంతగానో సంబరపడ్డాడు. తీరా చూస్తే.. ఆ తర్వాత జరిగింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. మిగిలిన షాప్ యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: పైకి చూస్తే కస్టమర్లు అనుకునేరు.. తిప్పి చూస్తే.. పైట చాటున చెడుగుడు యవ్వారం.!
Telangana
Follow us
N Narayana Rao

| Edited By: Ravi Kiran

Updated on: Mar 10, 2025 | 6:36 PM

హోలీ వచ్చిందంటే చాలు చందాలు కోసం వస్తుంటారు. రోడ్లపై వాహనాలు ఆపి మరి బలవంతంగా చందాలు వసూలు చేస్తారు. ఇళ్లు, షాపులకు వచ్చి అడిగినంత ఇచ్చే వరకు వదలరు. కానీ ఇక్కడ విచిత్ర దొంగతనం జరిగింది. హోలీ చందాల కోసం వచ్చి షాపులో పచ్చడి సీసాలు ఎత్తుకెళ్లారు మహిళలు. ఇక ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో చందాల కోసం వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వ్యాపారస్తుల హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఈ ఘటన మణుగూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో హోలీ సందర్భంగా చందాల కోసం వచ్చిన కొందరు మహిళలు ఓ షాపులో దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు, మణుగూరు లోని బాలాజీ స్వీట్ షాప్ లో హోలీ చందా కోసం వచ్చిన ముగ్గురు మహిళలు తమ చేతివాటం చూపించారు, యజమాని చందా ఇచ్చేందుకు వెనకకు తిరిగిన వెంటనే షాపు ముందు భాగంలో పచ్చడి సీసాలను చోరీ చేశారు, ఆ వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయారు, ఈ వ్యవహారం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది, ఆ తర్వాత సీసీ కెమెరా రికార్డును పరిశీలించిన యజమాని మహేష్ చోరీ ఘటనను గుర్తించారు, క్షణాల వ్యవధిలో చాకచక్యంగా మహిళలు చోరీకి పాల్పడడం చూసి ఆశ్చర్యపోయాడు, చిన్న దొంగతనమే కదా అని వదిలేశాడు, కానీ తోటి వ్యాపారస్తులకు మాత్రం దుకాణాల వద్దకు చందాల కోసం వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిషితంగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నాడు మహేష్.

వీడియో దిగువన చూడండి..