AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?

ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో చోటుచేసుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తొలుత తండ్రి రాము, కుమార్తె దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, తాజాగా ఈ కేసులో మరో విషాదకర మలుపు చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య రమ్య కూడా మంగళవారం (ఏప్రిల్ 28) కన్నుమూసింది.

మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
Mamillagudem Murder Mystery
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 28, 2026 | 2:06 PM

Share

ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో చోటుచేసుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తొలుత తండ్రి రాము, కుమార్తె దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, తాజాగా ఈ కేసులో మరో విషాదకర మలుపు చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య రమ్య కూడా మంగళవారం (ఏప్రిల్ 28) కన్నుమూసింది.

రెండు రోజుల క్రితం రాము, దివ్యశ్రీ విగతజీవులుగా పడి ఉండగా.. రమ్య, చిన్న కుమార్తె రితిక అపస్మారక స్థితిలో కనిపించారు. ఈ కేసును ఛేదించేందుకు రమ్య వాంగ్మూలం అత్యంత కీలకం అవుతుందని పోలీసులు భావించారు. సోమవారం ఉదయం ఆమె స్పృహలోకి వచ్చినట్లు కనిపించినా, పోలీసులు ప్రశ్నించినప్పుడు పొంతన లేని సమాధానాలు చెప్పింది. సాయంత్రానికి ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారింది.

ప్రస్తుతం మూడేళ్ల చిన్నారి రితిక మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరణాలకు గల కారణాలపై పోస్టుమార్టం నివేదికలోనూ స్పష్టత రాకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు మృతుల శరీర భాగాల నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపించారు. కుటుంబ కలహాలా? లేక ఆర్థిక ఇబ్బందులా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. దంపతులకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. FSL రిపోర్ట్ వస్తేనే వారు విషప్రయోగం చేసుకున్నారా లేదా మరేదైనా జరిగిందా అనే విషయంలో స్పష్టత రానుంది.

ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, మిగిలిన చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మామిళ్లగూడెం విషాదంలో మునిగిపోయింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us