పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్.. కట్ చేస్తే.. సీన్ రివర్స్ చేసిన ఖాకీలు!

పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి నేరస్థులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ ఫోన్ కాల్స్ చేస్తే లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకుంటారనే భయంతో, కేవలం ఇన్‌స్టాగ్రామ్ కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ములుగు మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో జరిగిన 20 తులాల భారీ బంగారం, నగదు దొంగతనం కేసులో

పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్.. కట్ చేస్తే.. సీన్ రివర్స్ చేసిన ఖాకీలు!
Instagram Calls Crime
Image Credit source: TV9 Bharatvarsh

Edited By:

Updated on: May 18, 2026 | 7:47 PM

నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత (టెక్నాలజీ) ఎంతలా అభివృద్ధి చెందుతోందో, నేరస్థులు కూడా దాన్ని అంతే తెలివిగా వాడుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడితే కాల్ డేటా రికార్డ్స్ (CDR), టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నిమిషాల్లో కనిపెడతారని భావించి.. కేవలం సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా మాత్రమే కాల్స్ మాట్లాడుకుంటూ భారీ చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాళ్ల ముఠా గుట్టును సిద్దిపేట జిల్లా పోలీసులు రట్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని చిన్నతిమ్మాపూర్ గ్రామానికి చెందిన శాలివాహిని నర్సింహులు ఇంట్లో ఈ నెల 4వ తేదీన దుండుగులు చొరబడ్డారు. నర్సింహులు కుమార్తెకు సంబంధించిన 20 తులాల బంగారు ఆభరణాలు, భార్యకు చెందిన బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో గజ్వేల్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందాలు అధునాతన సాంకేతిక ఆధారాలను పరిశీలించాయి. ఈ క్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షామీర్‌పేట్‌కు చెందిన మడిగెల బాలచందర్, జవహర్ నగర్‌కు చెందిన ఇప్పలపల్లి నరేష్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోత్రకొండ బాలకృష్ణలను నిందితులుగా గుర్తించారు. వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాము దొంగతనం ప్లాన్ వేసేటప్పుడు గానీ, దొంగతనం చేసేటప్పుడు గానీ ఎక్కడా సాధారణ ఫోన్ కాల్స్ వాడలేదని, కేవలం ఇన్‌స్టాగ్రామ్ కాల్స్ మాత్రమే ఉపయోగించామని నిందితులు ఒప్పుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాట్లాడితే పోలీసులు ఆచూకీ కనిపెట్టలేరని వారు భావించారు.

ఇవి కూడా చదవండి

అయితే, దొంగలు ఎంత తెలివిగా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్ వాడినప్పటికీ.. గజ్వేల్ పోలీసులు అంతకంటే అత్యాధునిక సైబర్ క్రైమ్ టెక్నాలజీని ఉపయోగించి నిందితుల జాడ కనిపెట్టారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ద్వారా పోలీసులు ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. నేరస్థులు ఎంతటి హైటెక్ టెక్నాలజీని వాడి తప్పించుకోవాలని చూసినా, చట్టం చేతి నుంచి, పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడం అసాధ్యం అంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us