పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల సమయాన్ని మరో అర్ధ గంట పెంచింది. దీనితో ఇకపై పది పరీక్షలు 3 గంటల 15 నిమిషాల పాటు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 6 పేపర్లతోనే పరీక్ష జరగనుంది. కరోనా కారణంగా విద్యార్ధులపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. అలాగే మారిన టైమింగ్స్ ప్రకారం ఈ ఎగ్జామ్స్‌ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు.