AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్.. వారికి నో జీరో టికెట్..!

ఆధార్ ఉంది ఓకే, కానీ చిరునామాలో తెలంగాణ లేదు. కాబట్టి జీరో టికెట్ ఇవ్వడం కుదరదు. ఆ అడ్రెస్ అప్ డేట్ చేస్తేనే టికెట్లు ఇస్తాం. RTC బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు కండక్టర్లు చెబుతున్న పదే, పదే మాట. అయితే ఇన్నాళ్లు చెల్లిన మా ఆధార్ కార్డులు ఇప్పుడు పనికిరావడం లేదనడం విడ్డూరంగా ఉందంటున్నారు మహిళలు.

Telangana: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్.. వారికి నో జీరో టికెట్..!
Zero Ticket
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2025 | 4:54 PM

Share

ఎన్నికల్లో హామి ఇచ్చిన విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించొచ్చు. అందుకోసం ఆధార్ కార్డు చూపిస్తే సరి. కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. అయితే ఇటీవల ఈ పథకానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అర్హులు ఆధార్ కార్డ్స్ అప్ డేట్ చేయకుంటే.. జీరో టికెట్స్ ఇవ్వలేం అని.. కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణించే మహిళలు, ఆర్టీసీ కండెక్టర్ల మధ్య వాగ్వాదాలు కామన్ అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధించి అధికారులు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో చాలామంది వినియోగిస్తున్న ఆధార్ కార్డ్ మీద రాష్ట్రం పేరు వద్ద ఆంధ్రప్రదేశ్ అనే ఉంది. ఆ ఆధార్ కార్డులు రాష్ట్రం విడిపోకముందు జారీ అయినవి కావడంతో.. అవి అప్పటి నుంచి అలానే ఉన్నాయి. దీంతో వాటిని అప్ డేట్ చేయించి.. అక్కడ తెలంగాణ అని మార్చాలని.. అలా అయితే జీరో టికెట్స్ జారీ చేస్తామని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆధార్ కార్డ్స్‌పై ఫోటోలు అప్ డేట్ చేయించడం లేదు. ఏప్పుడో 10, 15 ఏళ్ల క్రితం కార్డు జారీ చేసిన సమయంలో ఉన్న ఫోటోలే ఉన్నాయి. దీంతో కండక్టర్లు ప్రయాణించేవారిని అప్పటి ఫోటోలతో పోల్చలేకపోతున్నారు. దీంతో టికెట్లు ఇవ్వమని కండక్టర్లు చెప్పడం.. ఎందుకు ఇవ్వరని మహిళలు గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు బాగానే పని చేశాయి కదా.. ఇప్పడేంటి సమస్య అని కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డ్స్ అప్ డేట్ చేసుకోవడం చాలా సులభమైన పని అని.. అది చేయకుండా ఆర్టీసీ సిబ్బందితో దురుసుగా వ్యవహరించడం.. దుర్భాషలాడటం కరెక్ట్ కాదన్నది ఆర్టీసీ వెర్షన్. అందుకు అప్ డేట్ చేస్తేనే మంచిదని వారి సూచన.

కాగా ఆధార్ కార్డ్స్‌ను రెండు రకాలుగా అప్ డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ మార్చాలనుకుంటే.. ఆధార్‌ సెంటర్లలో లేదా ఆన్‌లైన్‌లో ‘మై ఆధార్‌ పోర్టల్‌’ ద్వారా ఛేంజ్ చేయవచ్చు. ఇక ఫొటో, బయోమెట్రిక్ అప్డేట్ కోసమైతే ఆధార సెంటర్లకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
యాసిడ్ పురుగుల భయం.. చేతులతో నలిపితే మంట, దురద, చర్మ సమస్యలు..
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జొన్నగిరి గనిలో పసిడి తవ్వకాలు షురూ..!
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
జూలో దారుణం.. మూడేళ్ల బాలుడిని మొసళ్ల బోనులోకి తోసేసిన అపరిచితుడు
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు