School Holidays: విద్యార్థులకు ఇది కదా కావాల్సింది.. వరుసగా 6 రోజులు పాఠశాలలకు సెలవులు!

School Holidays: పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు కార్మికులకు సైతం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండగ. దీని కారణంగా..

School Holidays: విద్యార్థులకు ఇది కదా కావాల్సింది.. వరుసగా 6 రోజులు పాఠశాలలకు సెలవులు!

Updated on: Dec 10, 2025 | 11:09 AM

School Holidays: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు వరుస సెలవులు వస్తున్నాయి. అయితే ఎన్నికల కారణంగా పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుండటంతో, ప్రభుత్వం పలు దఫాలుగా సెలవులు ప్రకటించింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సుమారు ఆరు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.

తొలి విడత పోలింగ్‌లో..

ఇక పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ నిర్వహణలో భాగంగా ఏర్పాట్లు అన్ని కూడా పాఠశాలల్లో జరుగుతున్నాయి. దీని కోసం డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 14న జరగనుండగా, 13, 14 తేదీల్లో సెలవు ఉంటుంది. అంటే శని, ఆదివారాలు వస్తుండటంతో వరుసగా సెలవులు ఉంటున్నాయి. ఇవి సాధారణ సెలవులే అయినా విద్యార్థులకు వరుసగా కలిసి వస్తున్నాయి.

ఇక మూడో విడత పోలింగ్‌:

ఇక మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ 17న ఉంది. పోలింగ్‌ ఏర్పాట్ల కారణంగా 16న సెలవు ఉండగా, 17న పోలింగ్‌ సందర్భంగా సెలవు ప్రరకటించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు కార్మికులకు సైతం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండగ. దీని కారణంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. అలాగే 26న బాక్సింగ్ డే,28న ఆదివారం ఇలా ఇక్కడ కూడా వరుసగా సెలవులు లభిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి